ట్విటర్‌లో ఇద్దరు ఇంజనీర్లను సంస్థ అధినేత ఎలాన్ మస్క్ బహిరంగంగా తొలగించారు. వారు ఇద్దరూ ఎలాన్ మస్క్‌ను విమర్శిస్తూ ట్విటర్‌లో పోస్టులు పెట్టారు. ఇలా పోస్టులు పెట్టన కొన్ని గంటల్లోనే వారిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాను వాక్ స్వేచ్ఛను పరిరక్షిస్తానని చెప్పిన మస్క్ కేవలం తనను విమర్శించారన్న ఒకే ఒక కారణంతో ఉద్యోగులను తొలగించడం పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తొలగింపుకు గురైన వారిలో ఇంజనీర్ ఎరిక్ ప్రోన్‌హోఫర్ ఒకరు ఆయన అండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ట్విటర్ యాప్‌పై పని చేశారు.
మస్క్ గతంలో చేసిన ఓ ట్విట్‌ను ఎరిక్ అధివారం నాడు రీ ట్విట్ చేశారు. దీనికి ట్విటర్ యాప్ సాంకేతికపరమైన అంశాన్ని మస్క్ అర్ధం చేసుకుంటున్న తీరు తప్పుు అన్న వ్యాఖ్యను జత చేశారు. దీనికి బదులిస్తూ మస్క్ అద ఎలాగో వివరించాలని కోరారు. ముందు ట్విటర్ అండ్రాయిడ్ స్లోగా పని చేస్తోందని, దాన్ని పరిష్కరించడానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఇలా వీరి మధ్య ట్విటర్‌లో సంవాదం నడించింది. చివరకు ఎలాన్ మస్క్ ఎరిక్‌ను తొలగిస్తున్నట్లు ట్విట్ చేశారు. దీనికి ఎరిక్ స్పందిస్తూ సెట్యూట్ ఎమోజీని జత చేశారు.
ఉద్వాసనకు గురైన మరో ఇంజినీర్ బెన్ లీబ్ కూడా గతంలో ఎలాన్ మస్క్ చేసిన ట్విట్‌ను రీ ట్విట్ చేస్తూ ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదని బలంగా చెప్పగలను అని కామెంట్ చేశారు. 10 సవంత్సరాలుగా పని చేస్తున్న తనను మస్క్ తొలగించారని లీబ్ మీడియాకు తెలిపారు.
ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన నాటి నుంచి అందులో అనేక మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. సంస్థ యాజమాన్యం, ఉద్యోగుల మధ్య జరిగే కమ్యూనికేషన్లలోనూ చాలా మార్పుులు చేశారు. అంతకు ముందు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇ-మెయిల్ లేదా స్లాక్ ద్వారా ఉద్యోగులు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లేవారు. ఇప్పుడు ఆ సరిస్థితులు లేవని దీంతో సంబంధం ఉన్న ఉద్యోగులు తెలిపారు. ఇప్పుడు అభ్యంతరాలు ఉంటే ఎవరికి చెప్పాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. దీని వల్ల ట్విటర్ పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్‌లో మరో కోడింగ్ ఫ్రీజ్‌కు యాజమాన్యం సోమవారం నాడు ఆదేశించింద. దీంతో యాప్‌లో కొన్ని ప్రొడక్ట్ ఆప్‌డేట్స్ ఆగిపోనున్నాయి. ఇలా ఎందుకు నిర్ణయం తీసుకున్నారో ఉద్యోగులకు కూడా తేలియచేయలేదు.