టెస్లా కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ ఎలన్ మస్క్ సోమవారం కీలక ప్రకటన చేశారు. తాను మళ్లిd కరోనా బారినపడినట్టు తెలిపారు. ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ.. పరీక్షలు చేయించినట్టు వివరించారు. దీంతో రిజల్ట్‌లో కరోనా పాజిటివ్‌గా తేలిందని ప్రకటించారు. పాజిటివ్ రావడంతో తాను ఐసోలేషన్‌కు వెళ్తున్నట్టు తెలిపారు. ఈ మధ్య కాలంలో తనతో కలిసిన వారు వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. లక్షణాలు లేకపోయినా.. పరీక్షలు చేయించుకుంటే మంచిదని స్పష్టం చేశారు. అయితే ఎలన్ మస్క్ కరోనా నిర్ధారణ పరీక్షలపై అనుమానాలు వ్యక్తం చేశారు. 2020, నవంబర్‌లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. రెండు సార్లు పాజిటివ్‌గా వచ్చింది. అదే రోజు మళ్లిd పరీక్షలు నిర్వహించగా.. రెండు సార్లు నెగిటివ్‌గా వచ్చింది. అయితే కరోనా నిర్ధారణ పరీక్షల కచ్చితతంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. చాలా వరకు కరోనా నిర్ధారణ పరీక్షలు కచ్చితమైన ఫలితాలు ఇవడం లేదని ఎలన్ మస్క్ అన్నారు.
షాంఘై కంపెనీకి కరోనా ఎఫెక్ట్
ర్యాపిడ్ టెస్టు కంటే.. పాలిమరేస్ చైన్ రియాక్షన్ పరీక్షల ఫలితాల కచ్చితత్వంపై ఆయన ఎలాంటి ప్రస్తావన చేయలేదు. గతవారం జర్మనీలోని గ్రున్‌హైడ్ ప్లాంట్‌లో టెస్లా తొలి కారును అందజేసేందుకు వచ్చినప్పుడు.. అభిమానులతో, ఉద్యోగులతో సరదాగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. షాంఘై నగరం తొమ్మిది రోజుల పాటు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో టెస్లా ఫ్యాక్టరీ కూడా నాలుగు రోజుల పాటు మూసివేయడం జరుగుతుంది. ఈ ప్లాంట్ నుంచి రోజుకు సుమారు 2,000కు పైగా కార్లను ఎగుమతి చేస్తుంటారు. ఫిబ్రవరిలో 56,000 పైచిలుకు కార్లను ఎక్స్‌పోర్టు చేశారు.
టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ కు కరోనా.. తేలికపాటి లక్షణాలతో ఐసోలేషన్‌లో
Advertisement
తాజా వార్తలు
Advertisement