Tuesday, November 26, 2024

వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ పై నియంత్రణ.. సంప్రదింపులు ప్రారంభించిన ట్రాయ్‌

వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ టెలిగ్రామ్‌ వంటి కమ్యూనికేషన్‌ యాప్స్‌పై నియంత్రణ విధించాలా వద్దా అనే అంశంపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఈ అంశంపై టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ సంప్రదింపులు ప్రారంభించింది. అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితుల సమయాల్లో ఈ కమ్యూనికేషన్‌ యాప్స్‌పై తాత్కాలిక నిషేధం విధించాలా, వద్దా అనే అంశంపై కూడా చర్చలు ప్రారంభించింది. ఇంంటర్నెట్‌ కాలింగ్‌ విషయంలో టెలికం ప్రొవైడర్లకు వర్తించే నియమాలే కమ్యూనికేషన్‌ యాప్స్‌కు వర్తింప ఏయాలని టెలికం సంస్థలు చాలా కాలంగా కోరుతున్నాయి. తమ లాగే లైసెన్స్‌ ఫీజు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చస్తున్నాయి. దీనిపై టెలికం విభాగం ట్రాయ్‌ను సంప్రదించింది. కమ్యూనికేషన్‌ యాప్స నియంత్రణ తాత్కాలిక నిషేధం వంటి 14 అంశాలపై ట్రాయ్‌ సంప్రదింపులు మొదలు పెట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement