Monday, November 18, 2024

ట్విట్టర్‌లో కంటెంట్‌ మోడరేషన్‌ కౌన్సిల్‌.. సీసీఐ జరిమానా ఉత్తర్వులపై న్యాయపోరాటం: గూగుల్‌

అనైతిక వాణిజ్య పద్ధతుల ఆరోపణలతో కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) విధించిన జరిమానాపై న్యాయపోరాటం చేస్తామని గూగుల్‌ పేర్కొంది. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ వ్యవస్థ వ్యవహారంలో కోర్టును ఆశ్రయించనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. సీసీఐ నిర్ణయం కారణంగా ఇతర అంశాల్లోనూ ఒత్తిళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని గూగుల్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సీసీఐ ఉత్తర్వులపై వారంలోపే సవాల్‌ చేయాలని నిర్ణయించింది.

ఆండ్రాయిడ్‌ మొబైల్‌ విభాగంలో గూగుల్‌ గుత్తాధిపత్యం ప్రదర్శిస్తోందంటూ ఈనెల 20న సీసీఐ సుమారు రూ.1337 కోట్ల జరిమానా విధించింది. వారం తర్వాత మరో 936 కోట్ల జరినామా వడ్డించింది. అనైతిక పద్ధతులు అవలంబించవద్దని హెచ్చరించింది. భారత్‌లో గూగుల్‌కు ఇలాంటి అనుభవం ఇదే తొలిసారి. గతంలో యూరప్‌ ప్రభుత్వం 3వేల కోట్ల జరిమానా విధించింది. దీనిపై న్యాయపోరాటం చేసినా ఫలితం దక్కలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement