అదానీకి చెందిన విజింజం పోర్టులో పనులను స్థానికులు అడ్డుకున్నారు. ఈ పోర్టు నిర్మాణం వల్ల తమ జీవనోపాధికి విఘాతం కలుగుతుందని స్థానిక మత్యకారులు ఆందోళన చేస్తున్నారు. కోర్టు తీర్పుు అదానీ గ్రూప్‌కు అనుకూలంగా రావడంతో పోర్టులో పని చేసేందుకు భారీ యంత్రాలను తరలించేందుకు అదానీ పోర్ట్స్ ప్రయత్నించింది. ఈ యంత్రాలను పోర్టులోకి వెళ్లకుండా ప్రధాన గేట్ వద్ద వీరు శనివారం నాడు ఆందోళనకు దిగారు. దీంతో పోర్టులో నిర్మాణ పనులు నిలిచిపోయాయి.
ఈ ట్రాన్స్షిప్మెంట్ పోర్టును ఆదానీ గ్రూప్ 900 మిలియన్ డాలర్ల పెట్టుబడితో నిర్మిస్తోంది. పోర్టు నిర్మాణం వల్ల కోస్తా ప్రాంతం దెబ్బతింటుందని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. మొత్తం 25 ట్రక్కులు పోర్టులోకి వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో ఒక్క ట్రక్కు కూడా లోపలికి వెళ్లలేకపోయింది. దీంతో పనులు ప్రారంభం కాలేదని పోర్టుకు చెందిన అధికారి ఒకరు చెప్పారు.