యాపిల్ ఐఫోన్ ప్రొ, ప్రొ మ్యాక్స్ మోడల్స్ ఫోన్లలో హీటింగ్ సమస్యపై వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా గేమ్స్ ఆడుతున్నప్పుడు, వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు, సినిమాలు చూస్తున్నప్పుడు వెనుకభాగం వేడెక్కుతోందని అసంఖ్యాకంగా ఫిర్యాదు వస్తున్నాయని సంస్థ అధికారికంగా ధ్రువీరించింది. ఈ సమస్యపై స్పందిస్తూ, కొత్తగా విడుదల చేసిన ఐఓఎస్‌లోని బగ్ ఇందుకు కారణమని గుర్తించింది.
లోపాన్ని సరిచేస్తామని చెప్పింది. ఈ మేరకు అంతర్జాతీయ వార్తా సంస్థకు వివరించింది. ఐఫోన్ ప్రొ, ప్రొ మ్యాక్స్ మోడల్స్‌లో ఐఓఎస్ 17లోని బగ్ కారణంగా బ్యాగ్రౌండ్ యాక్టివిటీ ఎక్కువగా జరుగుతోంది. దీనివల్ల ఫోన్ వేడెక్కుతోంది. దాంతోపాటు థర్డ్-పార్టీ యాప్‌ల నుంచి వచ్చే అప్డేట్లు కూడా ఫోన్ వేడెక్కేందుకు కారణం అవుతున్నాయి. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారంగా కొత్త ఐఒఎస్ 17 అప్డేట్ను విడుదల చేస్తాం అని కంపెనీ తెలిపింది.