Tuesday, November 26, 2024

Smart Competition | జియోతో కాంపిటీష‌న్‌.. పోకో ఫోన్స్‌తో ఎయిర్‌టెల్ ఒప్పందం!

జియోకు పోటీగా వినియోగదారులకు తక్కువ ధరలో 4జీ స్మార్ట్‌ఫోన్‌ అందించేందుకు ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్‌టెల్‌ సిద్ధమైంది. ఇందుకోసం మొబైల్‌ తయారీ సంస్థ పోకో ఫోన్స్‌తో జట్టు కట్టింది. ఎయిర్‌టెల్‌ కస్టమర్ల కోసం పోకో సీ51ఫోన్‌ను ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఈ కొత్త ఫోన్‌ను జులై 18 నుంచి ప్లిnప్‌కార్ట్‌లో రూ.5,999కే విక్రయించనున్నారు. ఈ మొబైల్‌పై అదనపు డేటాను కూడా ఇస్తున్నారు. పోకో సీ51 ఈ ఏడాది ఏప్రిల్‌లో మార్కెట్లోకి విడుదలైంది. దీన్ని ప్రస్తుతం ఆన్‌లైన్‌లో రూ.6,999కు విక్రయిస్తున్నారు. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌క్లూజివ్‌ పేరిట రూ.5,999కే విక్రయించనున్నారు.

- Advertisement -

ఇందులో 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజీ ఉంటుంది. 6.52 అంగుళాల హెచ్‌డీం డిస్‌ప్లే ఇస్తున్నారు. వెనుకవైపు 8 ఎంపీ కెమెరా, ముందువైపు 5 ఎంపీ కెమెరా ఉంది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌లో హెలియో జీ36 ప్రాసెసర్‌ను వినియోగించారు. ఫోన్‌తో పాటు 10వాట్స్‌ ట్రావెల్‌ అడాప్టర్‌, యూఎస్‌బీ కేబుల్‌ ఉంటుంది. యాప్స్‌, మీడియా, ఫైల్స్‌ స్టోరేజ్‌కోసం 4జీబీ ఇంటర్నల్‌ స్టోర్‌జ్‌ను అందిస్తుంది. ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌, 3.5ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌, బ్లూటూత్‌ 5.0, 2.4జీహెచ్‌జెడ్‌ వైఫై వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. పవర్‌ బ్లాక్‌, రాయల్‌ బ్లూ రంగుల్లో లభిస్తుంది.

ఇప్పటికే ఎయిర్‌టెల్‌ కస్టమర్లుగా ఉన్నవారు, కొత్తగా ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌లోకి పోర్ట్‌ అవ్వాలని అనుకునేవారు ఈ మొబైల్‌ను కొనుగోలు చేయొచ్చని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్‌ 18 నెలల వరకు ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌కు లాక్‌ అయివుంటుంది. నెలకు రూ.199 చొప్పున ఏ అన్‌లిమిటెడ్‌ ప్లాన్‌తోనైనా రీఛార్జి చేసుకోవచ్చు. 18 నెలల తర్వాత ఇతర నెట్‌వర్క్‌ సిమ్‌ను వినియోగించుకోవచ్చు. దీంతో పాటు 50జీబీ డేటాను ఉచితంగా ఇస్తున్నారు. 10 జీబీ చొప్పున మొత్తం 5 కూపన్లు ఐదు నెలల పాటు లభిస్తాయి. సిమ్‌ 2ను యథావిధిగా వేరే నెట్‌వర్క్‌ సిమ్‌ కార్డును వినియోగించుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement