అమెరికా బాస్కెట్ బాల్ దిగ్గజం కోబీ బ్రయాంట్ హెలికాప్టర్ ప్రమాదం ఫోటోలను లీక్ చేసిన కేసులో బాధితులకు నష్టపరిహారం క్రింద రూ 248 కోట్లు చెల్లించాలని లాస్ ఏంజిల్స్ కౌంటీని కోర్టు ఆదేశించింది. కాలిఫోర్నియాలో జనవరి, 2020లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో బ్రయాంట్, అతడి కుమార్తె గినితో పాటు మరో ఆరుగురు మరణించారు. వీరిలో బ్రయాంట్ మిత్రుడు చెస్టర్ భార్య, కుమార్తె కూడా ఉన్నారు.
అయితే దుర్ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది అక్కడి ఫోటోలను తీసి షేర్ చేశారు. వాటిని చూసి తీవ్ర భయాందోళనలకు, మనోవ్యథకు గురయ్యామని బాధితులైన బ్రయాంట్ భార్య వెనెస్సా చెస్టర్ కోర్టులో కేసు వేశారు. విచారించిన న్యాయస్థానం వెనెస్సాకు రూ 128 కోట్లు, సహవాదిగా ఉన్న చెస్టర్కు 120 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలని ప్రభుత్వ వర్గాలను ఆదేశించింది.