వారంలో మూడు రోజులు ఆఫీస్‌కు రాకుంటే ఉద్యోగం వదులుకోవాల్సి వస్తుందని ఉద్యోగులకు మెటా గట్టి వార్నింగ్ ఇచ్చింది. కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోంకు అన్ని కంపెనీలు అంగీకరించాయి. ప్రస్తుతం కరోనా పరిస్థితులు లేనప్పటికీ చాలా కంపెనీల్లో ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చిన పని చేసేందుకు సుముఖంగాలేరు. కొన్ని కంపెనీలు వారంలో మూడు రోజులైనా తప్పనిసరిగా ఆఫీస్ నుంచే వర్క్ చేయాలని కోరుతున్నాయి.
దీన్ని చాలా మంది ఉద్యోగులు పట్టించుకోవడంలేదు. మార్క్ జుకర్ బర్గ్‌కు చెందిన ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా ఉద్యోగులను తప్పనిసరిగా వారంలో మూడు రోజులు ఆఫీస్ నుంచే పని చేయాలని ఆదేశించింది. ఈ నియామవళిని ఉల్లంఘిస్తే ఉద్యోగం వదులుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. సెప్టెంబర్ 5 నుంచి వారానికి మూడు రోజులు ఆఫీస్‌లకు వచ్చి పనిచేయాల్సిందేనని ఉద్యోగులకు పంపించిన నోటీస్‌లు స్పష్టం చేసింది.
ఉద్యోగులు కార్యాలయాలకు వస్తున్నదీ, లేనిదీ తనిఖీ చేయాలని మేనేజర్లను కోరింది. ఆఫీస్‌ల నుంచి పని చేయడం వల్ల ఉద్యోగుల మధ్య స్నేహ సంబంధాలు మెరుగుపడతాయని, టీమ్ వర్ ్కకు ఈ నిర్ణయం దోహదపడుతుందని మెటా తెలిపింది. ఆఫీస్‌కు రావాలన్న నిబంధన నుంచి రిమోట్ ఉద్యోగులను మినహాయించింది. ఆఫీస్ నుంచి పని చేస్తేనే మంచి ఫలితాలు సాధించగలమని, ఇంట్లో ఉంటూ వర్క్ చేసే వారి కంటే ఆఫీస్‌లో పని చేసే వారే మంచి ఫలితాలు సాధిస్తున్నారని గతంలో ఒక సారి జుకర్‌బర్గ్ ఉద్యోగులతో చెప్పారు.
చాలా కంపెనీలు ఉద్యోగులు తప్పనిసరిగా కార్యాలయాలకు రావాల్సిని కోరుతున్నాయి. ప్రధానంగా టీమ్ వర్క్ మెరుగుపడేందుకు ఇది ఉపయోపగపడుతుందని స్పష్టం చేస్తున్నాయి. ఇండియాలో చాలా వరకు ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఆఫీస్ నుంచే వర్క్ చేయాలని గతంలోనే ఆదేశించాయి. మన దగ్గర కూడా కొన్ని కంపెనీలు వారంలో మూడు రోజులు ఆఫీస్ నుంచి వర్క్ చేసేందుకు అనుమతి ఇస్తున్నాయి.