Thursday, December 5, 2024

కోకాకోలా బెవరేజెస్ గ్రీన్‌ఫీల్డ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం రేవంత్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటలోని బండ తిమ్మాపూర్‌లో హిందూస్థాన్ కోకాకోలా బెవరేజెస్ (హెచ్‌సిసిబి) ఏర్పాటుచేసిన అత్యాధునిక గ్రీన్‌ఫీల్డ్ ఫ్యాక్టరీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. భారతదేశంలోని ప్రముఖ ఎఫ్ఎంసిజి కంపెనీలలో ఒకటైన హిందూస్థాన్ కోకాకోలా బెవరేజెస్ (హెచ్‌సిసిబి) కి ఇది ఒక మైలురాయిగా నిలుస్తుంది.

ఈ ప్రారంభోత్సవానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రవాణామంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి కొండా సురేఖ, హెచ్‌సిసిబి సీఈఓ జువాన్ పాబ్లో రోడ్రిగ్జ్‌తో పాటు కంపెనీకి చెందిన ఇతర సీనియర్ నాయకులు సహా ముఖ్య ప్రముఖులు హాజరయ్యారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “బండ తిమ్మాపూర్‌లో హెచ్‌సిసిబి పెట్టుబడులు, ప్రపంచ పారిశ్రామిక పెట్టుబడులకు ఆకర్షణ శక్తిగా వెలుగొందుతున్న తెలంగాణ ఖ్యాతిని నొక్కి చెబుతుంది. వ్యాపార వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి మేము కట్టుబడి ఉన్నాము. సమగ్ర విధానం అనుసరిస్తున్న హెచ్‌సిసిబిని మేము అభినందిస్తున్నాము. ఇది ఉద్యోగాలను తెస్తుంది, కమ్యూనిటీలను ఉద్ధరిస్తుంది మరియు ఈ ప్రాంతం అభివృద్ధికి గణనీయంగా దోహదపడుతుంది” అని అన్నారు.

హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ సీఈఓ జువాన్ పాబ్లో రోడ్రిగ్జ్ పెట్టుబడుల గురించి మాట్లాడుతూ, “హెచ్‌సిసిబి వృద్ధి ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు, తెలంగాణ పట్ల మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. ఈ అత్యాధునిక ఫ్యాక్టరీ అధునాతన తయారీ, పర్యావరణ అనుకూల సాంకేతికతను మిళితం చేసింది. దీనిని మన పరిశ్రమలో ఒక బెంచ్‌మార్క్‌గా నిలువుతుంది. ఈ ప్రభుత్వం ప్రత్యేకించి గౌరవనీయులైన ముఖ్యమంత్రి, పరిశ్రమల శాఖామంత్రి ప్రత్యేకంగా చొరవ తీసుకుని ట్యాపింగ్ పాయింట్ కనెక్షన్ , మిషన్ భగీరథ ద్వారా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపరితల నీటి పైప్‌లైన్‌ను పూర్తి చేయటం, మా ఫ్యాక్టరీ కార్యకలాపాలకు విద్యుత్ లభ్యత కోసం త్వరిత అనుమతిని అందించడం చేశారు. అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ, ఈ నూతన గ్రీన్ ఫీల్డ్ ఫ్యాక్టరీ లో మా ఉత్పత్తిని ప్రారంభించటానికి అవి తోడ్పడ్డాయి” అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement