ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ యూజర్లకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో చాలా లోపాలు ఉన్నాయని, ఆ లొసుగులను ఉపయోగించుకుని హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడవచ్చని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ యూజర్లు వెంటనే లేటెస్ట్ వెర్షన్‌తో అప్‌డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీఈఆర్‌టీ (కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్) స్పష్టం చేసింది.
క్రోమ్‌లోని బగ్స్ కారణంగా హ్యాకర్లు కంప్యూటర్‌లను తమ అధీనంలోకి తీసుకుని ఆ కంప్యూటర్‌లను ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసే అవకాశం ఉందని తెలిపింది. కంప్యూటర్‌లో నిక్షిప్తమైన డేటాను, క్రోమ్ బ్రౌజర్‌లో సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లను హ్యాకర్లు దొంగిలించవచ్చని సీఈఆర్‌టీ వివరించింది.