ప్రముఖ టూ వీలర్ తయారీ కంపెనీ బజాజ్ ఆటో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. ‘చేతక్ అర్బనే’ పేరుతో ఈ కొత్త ఈవీ స్కూటర్ మార్కెట్లో కి ఎంట్రీ ఇచ్చింది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.1.15 లక్షల ఎక్స్-షోరూమ్‌లో అందుబాటులో ఉంటుంది. అయితే, దీనిని ‘Tecpac’తో అప్‌గ్రేడ్ చేయవచ్చు. దీంతో మరిన్ని ఫీచర్లను అన్‌లాక్ చేస్తుంది. ఈ అప్‌గ్రేడ్‌తో చతక్ అర్బనే ఈవీ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.21 లక్షలకు అప్‌గ్రేడ్ అవుతుంది.
ఈ కొత్త చేతక్ 2.9kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. చేతక్ అర్బేన్ గంటకు 63కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. ఇప్పటికే ఉన్న మోడల్‌కు సమానంగా ఉంటుంది. అయితే, టెక్ప్యాక్స్తో కస్టమర్లు గంటకు 73 కిలోమీటర్ల అధిక వేగాన్ని అన్‌లాక్ చేయవచ్చు.
అంతే కాకుండా, టెక్‌ప్యాక్ అప్‌గ్రేడ్ ప్యాకేజీలో స్పోర్ట్ మోడ్, హిల్-హోల్డ్ అసిస్ట్, రివర్స్ మోడ్, ఫుల్-యాప్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇక ఈ స్కూటర్ మాట్టే కోర్సే గ్రే, సైబర్ వైట్, బ్రూక్లిన్ బ్లాక్, ఇండిగో మెటాలిక్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.