Saturday, November 23, 2024

మల్టీ అసెట్‌ ఇన్వెస్టింగ్‌తో పోర్ట్ ఫోలియో అస్థిరతకు చెక్‌.. భారీగా క్షీణించిన ఈక్విటీ మార్కెట్‌

2020, 2021 ఈక్విటీ పెట్టుబడిదారులకు ప్రత్యేకమైన సంవత్సరాలు. ఈక్విటీ ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ ఫోలియోలను ముందుకు తీసుకెళ్లారు. మల్టి అసెట్‌ ఇన్వెస్టింగ్‌ అనేది.. పోర్ట్‌ ఫోలియో అస్థిరతను అరికట్టడంలో సహాయపడుతుందని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ రిటైల్‌ సేల్స్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సౌత్‌ జోనల్‌ హెడ్‌ ఎస్‌ హరీష్‌ అభిప్రాయపడ్డారు. ఈ వ్యూహానికి 2022లో బ్రేక్‌ పడినట్టు స్పష్టంగా తెలుస్తున్నది. ఈక్విటీ మార్కెట్లు.. రికార్డు గరిష్ట స్థాయి నుంచి పడిపోయాయి. క్రమంగా అస్థిరత నమోదైంది. చాలా మందికి ఇది డైవర్సిఫికేషన్‌ ప్రాముఖ్యతకు సంబంధించిన కఠినమైన రిమైండర్‌గా వచ్చింది. పెట్టుబడి పెట్టేటప్పుడు.. సరైన మార్గాలను ఎంచుకోవడం కంటే.. డైవర్సిఫికేషన్‌ తక్కువ క్లిష్టమైనది కాదు. విజయవంతమైన పెట్టుబడికి.. మల్టి అసెట్‌ విధానం ఎంతో కీలకం. మల్టి అసెట్‌ ఇన్వెస్టింగ్‌ ఎలా వర్క్‌ చేస్తుందంటే.. ఇది ఈక్విటీ, స్థిర ఆదాయం, నగదు, బంగారం వంటి వివిధ అసెట్‌ అంశాలపై పెట్టుబడి పెట్టడం. వివిధ ఆర్థిక, మార్కెట్‌ పరిస్థితుల్లో.. వివిధ అంశాలు వేర్వేరుగా ప్రవర్తిస్తాయి. ప్రతీ అసెట్‌ క్లాస్‌.. దాని సొంత పనితీరును కలిగి ఉంటుంది. వైవిధ్యభరితంగా ఉండటంతో పెట్టుబడిదారులు వివిధ మార్కెట్‌ కదలికల నుంచి ప్రయోజనం పొందగలుగుతారు.

ఒక దాంట్లో క్షీణత మరో కేటగిరిలో పెరుగుదల..

మల్టి అసెట్‌ ఇన్వెస్ట్ మెంట్‌ పోర్ట్ ఫోలియో.. అస్థిరతను అరికట్టడంలో సహాయపడుతుంది. ఒక కేటగిరిలోని క్షీణత.. మరో కేటగిరిలోని పెరుగుదల నష్టాన్ని భర్తీ చేస్తుంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో.. ఏ అసెట్‌ క్లాస్‌ ఎలా పెర్ఫార్మ్‌ చేస్తుందో ఊహించలేము. అంచనా వేసి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది క్రీడా మైదానంలో విజేతను ఊహించడం లాంటిదే. ఫిఫా వరల్డ్ కప్‌ విజేత అయినా.. అసెట్‌ క్లాస్‌ అయినా.. విజేతలు ప్రతీ ఏడాది మారుతూ ఉంటారు. 2012లో ఇండియన్‌ ఈక్విటీ ఎంతో బాగా రాణించింది. 2013లో గ్లోబల్‌ ఈక్విటీ రాణించింది. 2014, భారతీయ ఈక్విటీ, స్థిర ఆదాయం రెండింటికి చెప్పుకోదగిన సంవత్సరమే.. 2017లో ఈక్విటీ మళ్లిd గాడిలో పడింది. 2018లో మళ్లి క్షీణించింది. దీనికి భిన్నంగా 2018లో బంగారం మంచి ప్రదర్శన కనబర్చింది. 2019లో గ్లోబల్‌ ఈక్విటీ, గోల్డ్‌ రెండూ రాణించాయి. ఏడాది ప్రాతిపదికన అసెట్‌ క్లాస్‌ ఎలా పని చేస్తుందో అంచనా వేయడం చాలా కష్టం. అందుకే మల్టి అసెట్‌ పోర్ట్ ఫోలియోను ఏర్పాటు చేసుకోవడం అత్యుత్తమం. మ్యూచువల్‌ ఫండ్‌ ఎంతో మంచిది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement