Friday, November 22, 2024

వరుస లాభాలకు చెక్‌, ఆద్యంతం నష్టాలోనే సూచీలు.. 360 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌..

దేశీయ స్టాక్‌ మార్కెట్స్‌లో మూడు రోజుల లాభాలకు మంగళవారం చెక్‌ పడింది. క్రితం సెషన్‌లో అయితే సెన్సెక్స్‌ ఏకంగా 1000 పాయింట్లకు పైగా లాభపడింది. కానీ మంగళవారం ప్రాఫిట్‌ బుకింగ్‌ కనిపించింది. దీంతో ప్రారంభం నుంచి సూచీలు నష్టాల్లోనే కదలాడాయి. ఏ దశలోనూ లాభాల్లోకి రాలేదు. పైగా అంతకంతకూ నష్టపోయిన సెన్సెక్స్‌.. ఓ సమయంలో దాదాపు 600 పాయింట్ల నష్టాల్లో కనిపించింది. చివరికి 360 పాయింట్ల నష్టంతో ముగిసింది. సెన్సెక్స్‌ ఉదయం 55,622 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 55,925 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 55,369 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్‌ చివరికి 359.33 పాయింట్లు క్షీణించి.. 55,566 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ఉదయం 16,578.45 పాయింట్ల వద్ద ప్రతికూలంగా ప్రారంభమైంది. ఇంట్రాడేలో నిఫ్టీ 16,521.90 పాయింట్ల వద్ద కనిష్టాన్ని చేరుకుంది. చివరికి 76.85 పాయింట్లు నష్టపోయి.. 16,584.55 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే.. రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.77.60 వద్ద ట్రేడ్‌ అవుతున్నది.

నష్టాలతోనే ప్రారంభం..

ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు.. మంగళవారం అంతా అదే ఒరవడిని కొనసాగించాయి. కనిష్టాల వద్ద కోలుకుని నిన్నటి ముగింపు స్థాయికి వచ్చినప్పటికీ.. చివరి అరగంటలో మళ్లిd అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. రష్యా చమురు దిగుమతులపై ఐరోపా ఆంక్షలు విధించడం సూచీల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీనికితోడు సోమవారం భారీ ర్యాలీ కారణంగా ప్రాఫిట్‌ బుకింగ్‌ చేశారు. అలాగే నాల్గో త్రైమాసికం జీడీపీ డేటా నేపథ్యంలో మార్కెట్లు అప్రమత్తంగా ఉన్నాయి. భారీ అంచనాలతో వచ్చిన ఎల్‌ఐసీ ఐపీఓ వ్యాల్యూ ప్రస్తుతం రూ.811.30 వద్ద ఉంది. నేడు 3.16 శాతం క్షీణించింది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఎన్‌టీపీసీ, ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్‌, టెక్‌ మహీంద్రా, టైటాన్‌, ఐటీసీ, టాటా స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, విప్రో, ఏషియన్‌ పెయింట్స్‌, మారుతీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌యూఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభాలతో ముగిశాయి. కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, సన్‌ ఫార్మా, రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, టీసీఎస్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement