ఇదే సమయంలో.. భారత్ ఇంధన అవసరాలను తీర్చేందుకు ఇరాన్ సుముఖం వ్యక్తం చేసింది. థర్డ్ పార్టీతో సంబంధం లేకుండా నేరుగా భారత్‌కు చమురు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ దేశ రాయబారి ఇప్పటికే అనధికారికంగా ప్రకటించారు. అయితే తాజాగా.. ఇరాన్ కూడా తక్కువ ధరకే చమురును అందజేసేందుకు భారత్‌కు హామీ ఇచ్చింది. ఇరు దేశాల కరెన్సీ (రూపాయి-రియాల్)లోనే లావాదేవీలు జరుపుకోవచ్చని భారత్‌లో ఇరాన్ రాయబారి అలీ చెగెనీ ఇప్పటికే వెల్లడించారు. గతంలో కూడా ఇరాన్.. భారత్ రిఫైనరీలు చెల్లించాల్సిన మొత్తాలను ఎగుమతుల చెల్లింపులకు ఆ దేశం వినియోగించింది.
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పెట్టిన ఆంక్షల కారణంగా ఇరాన్ నుంచి భారత్ చమురు దిగుమతులను అప్పట్లో నిలిపివేసింది. చమురు ఎగుమతులు మళ్లి ప్రారంభమైనట్టయితే రెండు దేశాల మధ్య వాణిజ్యం 30 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అలీ చెగానీ ఆశాభావం వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..