దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు క్రమంగా ఆదరణ పెరుగుతున్నది. కొద్ది నెలలుగా ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు పెరిగిపోయాయి. ఆటోమొబైల్ కంపెనీలు సరికొత్త ఫీచర్లతో కొత్తమోడల్ ఈవీ కార్లను మార్కెట్‌లో ఆవిష్కరిస్తున్నాయి. మరోవైపు, ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేసే కస్టమర్లకు 0.50 శాతం తక్కువ వడ్డీకి బ్యాంకులు రుణాలు ఆఫర్ చేస్తున్నాయి. ఈ దీపావళి పండుగ సందర్భంగా ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలు కోసం తక్కువ వడ్డీపై రుణాలిస్తున్న ప్రధాన బ్యాంకులు.. రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు కనిష్ట స్థాయికి తగ్గించడమో.. పూర్తిగా మాఫీ చేస్తున్నాయి.
సాధారణ వా#హనాలు, కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు 0.10-0.50 శాతం తక్కువ వడ్డీకి రుణాలు ఆఫర్ చేస్తున్నట్లు బ్యాంకుల అధికారులు చెబుతున్నారు. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) సాధారణ కార్ల కొనుగోలుదారులకు 7.80శాతం నుంచి 8.65శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది. విద్యుత్ కార్ల కొనుగోలుపైన పన్ను మినహాయింపు కూడా ఉంది.