పర్యావరణ సహిత కరెంట్ ఉత్పత్తి దిశగా ప్రస్తుత ప్రపంచం ముందడుగు వేస్తోంది. ఇందుకోసం కాలిఫోర్నియా-శాన్‌డియాగో వర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చింది. అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్న పరికరం అచ్చం ప్లాస్టర్ మాదిరిగా ఉంటుంది. ఇది చెమట నుంచి తక్కువ మొత్తంలో కరెంట్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రానిక్ చిప్ కనిపెట్టారు. ఇది వేలు ఒత్తిడిని శక్తిగా మార్చుతుంది. ఈ పరికరాన్ని మన చేతి వేళ్ళకు చుట్టుకోవాలి. అయితే అలా చూసుకున్నప్పుడు రాత్రివేళల్లో లేదా ఇతర సమయాల్లో మన చేతి నుండి వచ్చే చెమట ద్వారా ఆ పరికరంలో విద్యుత్ ఉత్పత్తి అవుతుందట. ఈ విద్యుత్‌తో మొబైల్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఒక వేలికి ధరిస్తే 10గంటల్లో 400 మి.జౌల్స్ శక్తిని సేకరిస్తుంది. ఇది ఒక డిజిటల్ వాచ్‌ను 24 గంటలు పనిచేసేలా ఛార్జ్ చేయగలదు.
ప్రస్తుతం మనం వినియోగిస్తున్న స్మార్ట్ ఫోన్లలో ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండటం లేదు. దానికి కారణం మనం ఉపయోగిస్తున్న స్మార్ట్ ఫోన్లు 4జీ నెట్ వర్క్‌కు సంబంధించినవి. అంతే కాకుండా ఈ ఫోన్‌లు పెద్ద స్క్రీన్ కలిగి ఉంటున్నాయి. అంతే కాకుండా రోజులో గంటల తరబడి ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్‌లో వీడియోలు చూడటం, చాటింగ్ చేయడం చేస్తూ ఉంటారు. దీంతో ఛార్జింగ్ త్వరగా పూర్తి కావడంతో మళ్లీ ఛార్జింగ్ పెట్టేందుకు వెళ్తుంటారు. అందుకే చెమటతో ఛార్జింగ్ ఎక్కించే పరికరాన్ని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఒకవేళ ఈ ప్రయోగం విజయవంతం అయితే ఛార్జింగ్ బెడద తప్పినట్టే.