హైదరాబాద్ : జియో-బీపీతో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై నెక్సెస్ మాల్స్ ఒప్పందం చేసుకుంది. దేశంలోని 13 నగరాల్లో ఉన్న 17 మాల్స్‌లో ఈవీ ఛార్జీంగ్ స్టేషన్లు, బ్యాటరీ స్వైపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని నెక్సెస్ తెలిపింది. రిలయన్స్ జియో, బీపీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈవీ ఛార్జీంగ్ సిస్టమ్స్‌ను మొదట నావీ ముంబాయి, బెంగళూర్, హైదరాబాద్, పూణ, అహ్మాదాబాద్‌లో ఈ జూన్ నుంచే అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఇవి 24 గంటలు టూ వీలర్స్, కార్ల ఛార్జింగ్ సదుపాయంతో నడిపిస్తామని తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.