న్యూఢిల్లి : బ్యాంకు వేళల్లో మార్పులు తీసుకొస్తూ.. ఆర్‌బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. సోమవారం నుంచే వాటిని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే బ్యాంకు కస్టమర్లకు మాత్రం కొంత ఉపయోగకరంగానే ఉంది. సోమవారం నుంచి బ్యాంకులు అదనపు పని గంటలు పని చేస్తాయి. బ్యాంకులు ఉదయం 9 గంటలకు తెరుచుకుంటాయి. అయితే క్లోజింగ్ సమయం మాత్రం యథాతథంగానే ఉంటుందని ఆర్‌బీఐ ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా బ్యాంకులు తెరుచుకునే సమయాలను గతంలో తగ్గించింది. ఇప్పుడు క్రమంగా సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నందున సోమవారం నుంచి పని గంటలు మార్చింది.
తమ నియంత్రణలోని మార్కెట్ ట్రేడింగ్ సమయాలలో కూడా ఆర్‌బీఐ మార్పులు చేసింది. కొత్త ట్రేడింగ్ సమయం కూడా సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఆర్‌బీఐ నియంత్రణలో నడిచే మార్కెట్లు, కాల్ మనీ, గవర్నమెంట్ పేపర్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, కార్పొరేట్ బాండ్స్ రెపో, రూపాయి వడ్డీ రేట్ల డెరివేటివ్స్ సమయాల్లో మార్పులు వచ్చాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఉంటుంది. ఇప్పటి వరకు ట్రేడింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యేది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..