Saturday, November 23, 2024

తేలికపాటి మాంద్యమే అంటున్న సీఈవోలు.. కేపీఎంజీ సీఈఓ అవుట్‌లుక్‌ రిపోర్టు

ఆర్థిక మాంద్యం స్వల్పంగా, తక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని సీఈఓలు అభిప్రాయపడ్డారు. ఇండియా సీఈఓ అవుట్‌లుక్‌ 2022 పేరుతో కేపీఎంజీ ఒక సర్వే నిర్వహించింది. మొత్తం 125 సీఈఓలను కేపీఎంజీ అభిప్రాయాలు కోరింది. 58 శాతం మంది ఇండియా, గ్లోబల్‌ సీఈఓలు ఆర్థిక మాంద్యం స్వల్పకాలం పాటు ఉండి, తక్కువ ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. మన దేశంలోని చాలా మంది సీఈఓలు కొవిడ్‌ ప్రభావం, ఆర్థిక అంశాలు, ముఖ్యంగా పెరుగుతున్న వడ్డీరేట్లు, ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం, సంస్థలకున్న పేరుప్రఖ్యాతుల రిస్క్‌ వంటి అంశాలు ప్రధానంగా ఇండియన్‌ సీఈఓల అధిక ప్రాధాన్యలుగా ఉన్నాయి. వచ్చే సంవత్సరం ఆర్ధిక మాంద్యం వస్తుందని 66 శాతం మంది ఇండియన్‌ సీఈఓలు, 86 శాతం మంది గ్లోబల్‌ సీఈఓలు అభిప్రాయపడ్డారు. ఇది కంపెనీల ఆదాయంపై 10 శాతం వరకు ప్రభావం చూపుతుందని ఇండియన్‌ సీఈవోల్లో 86 శాతం, గ్లోబల్‌ సీఈవోల్లో 71 శాతం మంది అభిప్రాయపడ్డారు. అంచనా వేసిన వృద్ధిపై ఇది ప్రభావం చూపుతుందని వీరు అభిప్రాయపడ్డారు.

గ్లోబల్‌ ఎకానమి రానున్న ఆరు నెలల్లో స్థిరంగానే ఉంటుందని ఇండియన్‌, గ్లోబల్‌ సీఈఓలు అభిప్రాయపడ్డారు. 57 శాతం మంది గ్లోబల్‌ ఈసీఓలు మాత్రం రానున్న మూడు సంవత్సరాల్లో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ మెరుగైన పనితీరును కనబరస్తుందని భావిస్తున్నారు. వచ్చే మూడు సంవత్సరాల్లో తమ సంస్థల వృద్ధి పట్ల కూడా నమ్మకంగా ఉన్నారు. సర్వేలో పాల్గొన్న సీఈఓలు తమ సంస్థ పనితీరు పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నారు. వారు సాంకేతికత, ప్రతిభ ద్వారా ప్రస్తుత పరిస్థితిని ఎక్కువగా ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోందని సర్వేపై స్పందిస్తూ కేపీఎంజీ సీఈఓ యోజ్జీ నాగ్‌పో రేవాలా అభిప్రాయపడ్డారు.

ఆర్థిక వ్యవస్థ ప్రతికూలతల మూలంగా గ్రేట్‌ రిజిగ్నినేషన్‌ తగ్గుతుందని సీఈఓలు భావిస్తున్నారు. ఇప్పటికే తాము కొత్త నియామకాలను నిలిపేవేసినట్లు 39 శాతం గ్లోబల్‌ సీఈఓలు తెలిపారు. 47 శాతం ఇండియన్‌ ఈసీఓలు, 46 శాతం మంది గ్లోబల్‌ సీఈఓలు తాము ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి మూలంగా తాము డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఇండియన్‌, గ్లోబల్‌ సీఈఓలు స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement