Monday, November 18, 2024

ఎయిర్‌బ్యాగ్స్ నిబంధన అమలు వాయిదా వేసిన కేంద్రం

ఇప్పటికే ఉత్పత్తి అయిన కార్లలో ముందువైపు రెండు ఎయిర్‌బ్యాగుల నిబంధనను కేంద్రం వాయిదా వేసింది. దీనికి నిర్దేశించిన గడువును రహదారుల మంత్రిత్వ శాఖ మరో నాలుగు నెలలు పొడిగించింది. కొవిడ్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ సీనియర్‌ అధికారి పేర్కొన్నారు. తాజా గడువును డిసెంబర్‌ 31 వరకు పొడిగించినట్లు తెలిపారు.

ఏప్రిల్‌ 1, ఆ తర్వాత తయారైన వాహనాలకు ముందువైపు రెండు ఎయిర్‌బ్యాగులను తప్పనిసరి చేస్తూ మార్చి 6న రవాణా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటికే ఉత్పత్తి అయిన మోడళ్లకు ఆగస్టు 31ను గడువుగా నిర్ణయించారు. దాన్ని తాజాగా నాలుగు నెలలు పొడిగించారు. డ్రైవర్‌ సీటుకు ఎయిర్‌బ్యాగ్‌ తప్పనిసరి నిబంధన చాలా రోజులుగా అమలవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement