Friday, November 22, 2024

Almonds: బాదంలతో యోగా దినోత్సవాన్ని జరుపుకోండి.. ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోండి

హైదరాబాద్ : అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. మన జీవితాలపై యోగా పరివర్తన ప్రభావం గురించి అవగాహన పెంచడానికి ప్రపంచ వేదికగా ఇది ఉపయోగపడుతుంది. బాదంలో ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ, జింక్, కాపర్, మెగ్నీషియం, మంచి ఆరోగ్యానికి అవసరమైన అనేక ఇతర పోషకాలు అతి సహజంగా వున్నాయి. ఫిట్‌నెస్, సెలబ్రిటీ ఇన్‌స్ట్రక్టర్, యాస్మిన్ కరాచీవాలా మాట్లాడుతూ… యోగా అనేది మనస్సు, శరీరం, ఆత్మను పెంపొందించే శక్తివంతమైన అభ్యాసమన్నారు. మనం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ , మన శరీరాలను పోషకాలతో కూడిన ఆహారాలతో నింపడం ప్రాముఖ్యతను గుర్తుచేసుకుందామన్నారు. బాదం దానిలో సమృద్ధిగా ఉండే పోషకాలు, ఆరోగ్యకరమైన మంచితనంతో మన యోగా ప్రయాణానికి తోడ్పడేందుకు ఆదర్శవంతమైన చిరుతిండిని ఎంపిక చేస్తుందన్నారు.

అవి సహజమైన శక్తి, ప్రొటీన్, కొన్ని అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయన్నారు. న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ… టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో యోగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందన్నారు. జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ డయాగ్నస్టిక్ రీసెర్చ్‌లో ప్రచురించబడిన అధ్యయనమన్నారు. యోగాతో పాటు, సంపూర్ణ వెల్‌నెస్ ప్రణాళికను రూపొందించడానికి ప్రతిరోజూ బాదంపప్పును జోడించాలని తాను సూచిస్తున్నానన్నారు. ప్రఖ్యాత భారతీయ టెలివిజన్ అండ్ చలనచిత్ర నటి నిషా గణేష్ మాట్లాడుతూ…తన ఫ్లెక్సిబిలిటీ, బలం, మానసిక దృష్టిని మెరుగుపరచడంలో యోగా కీలక పాత్ర పోషించిందన్నారు. బాదం తన పోషణలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సుప్రసిద్ధ దక్షిణ భారత నటి ప్రణీత సుభాష్ మాట్లాడుతూ… యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదు అది ఒక జీవన విధానమన్నారు. బాదం, వాటి సహజమైన మంచితనం యోగా రొటీన్‌కు సరిగ్గా సరిపోతాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement