హైదరాబాద్ : ప్రముఖ లూబ్రికెంట్ తయారీదారు అయిన క్యాస్ట్రోల్ ఇండియా లిమిటెడ్ 2024 నవంబర్ 1 నుండి దాని కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా కేదార్ లేలేని నియమించినట్లు ప్రకటించింది. హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్ యూఎల్)లో రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ తర్వాత కేదార్ క్యాస్ట్రోల్ ఇండియాలో చేరారు.
ఈ నియామకంపై క్యాస్ట్రోల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ రాకేష్ మఖిజా మాట్లాడుతూ… కేదార్‌ను క్యాస్ట్రోల్ ఇండి యాకు స్వాగతిస్తున్నందుకు తాము సంతోషిస్తున్నామన్నారు. వృద్ధిని నడిపించడంలో, సంక్లిష్ట మార్కెట్లలో పెద్ద జట్లను నడిపించడంలో అతని అపార అనుభవం ఆయనను క్యాస్ట్రోల్ ఇండియాకు నాయకత్వం వహించడానికి అత్యు త్తమ ఎంపికగా చేస్తుందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సందీప్ అసాధారణమైన నాయకత్వాన్ని అందించినందుకు తాను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. మార్కెట్లో తమ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఆయన సహకారం అమూల్యమైనదన్నారు.
కొత్తగా అంతర్జాతీయ పాత్రలో ఆయన విజయం సాధించాలని తాము కోరుకుంటున్నామన్నారు. ముత్యాల నగరంగా పేరొందిన హైదరాబాద్ లో రెండు దశాబ్దాల క్రితం మోన్ స్టర్.కమ్ కోసం ప్రొడక్ట్ లీడ్, బి2బి బ్రాండ్ మేనేజర్‌గా తన అనుభవాన్ని క్యాస్ట్రోల్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కేదార్ లేలే వివరించారు. హైదరాబాద్‌కు తన హృదయంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉందన్నారు. బలమైన కస్టమర్ సంబంధాలను, వ్యూహాత్మక భాగస్వామ్యాలను పెంపొందించడంలో తన విధానాన్ని రూపొందించడంలో ఇది కీలక పాత్ర పోషించిందన్నారు. నగరం శక్తివంతమైన వ్యాపార స్థితిగతులు, విభిన్న మార్కెట్ అవకాశాలు తనకు బి2బి మార్కె టింగ్, ఉత్పత్తి నిర్వహణ, అధునాతన పరిష్కార విక్రయాలపై అమూల్యమైన అనుభవాలు, దృక్పథాలను అందించాయన్నారు.