న్యూఢిల్లి : సీఎన్‌హెచ్ ఇండస్ట్రియల్ బ్రాండ్.. కేస్ (సీఏఎస్‌ఈ) కన్‌స్ట్రక్షన్స్ ఎక్విప్‌మెంట్ మంగళవారం 11వ ఎడిషన్ అంతర్జాతీయ నిర్మాణ సామాగ్రి, నిర్మాణ సాంకేతికత ట్రేడె ఫెయిర్ 2021ను నిర్వహిస్తున్నది. 180 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంబరాలు నిర్వహించింది. ఈ సందర్భంగా కంపెనీ కొన్ని ఎక్విప్‌మెంట్‌లను ప్రదర్శించింది. అందులో 770 ఈఎక్స్ ప్లస్, 851 ఎఫ్‌ఎక్స్ సీపీ వేరియంట్, 1107 ఈఎక్స్ సాయిల్ వైబ్రేటరీ కంపాక్టర్, సీఎక్స్ 220సీ ఎల్-హెచ్‌డీ ఎక్క్‌వేటర్, మోటార్ గ్రాడా 45సీతో పాటు ఎక్కువగా ఎదురుచూసిన 770 ఎన్‌ఎక్స్‌ఈ 49.5 హెచ్‌పీ లోడర్ బ్యాక్‌హో ఉన్నాయి.
దక్షిణాసియాలో ఎంతో బాగా రాణిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని సీఎన్‌హెచ్ ఇండస్ట్రియల్ వైస్ ప్రెసిడెంట్ ఫ్యాబ్రిజియో సియోపొలినా అన్నారు. 180 ఏళ్లుగా తాము సేవలు అందిస్తున్నట్టు వివరించారు. కేస్ కన్‌స్ట్రక్షన్స్ ఎక్విప్‌మెంట్ ప్లాంట్ హెడ్ సత్యేంద్ర తివారీ మాట్లాడుతూ.. భారత ప్రభుతం తీసుకొచ్చిన ఆత్మనిర్భర్ భారత్‌లో భాగసాములు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కేస్ ఇండియా.. 30 దేశాల్లో తమ ఉత్పత్తులను తయారు చేస్తోందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..