హైదరాబాద్, (ప్రభ న్యూస్) : భారతీయ ఆటోమొబైల్ రంగం అభివృద్ధి చెందుతున్న వేళ నగరంలో ప్రీఓన్డ్ (వినియోగించిన) వాహనాలకు అసాధారణమైన డిమాండ్‌తో కార్స్24 ప్రత్యేకంగా నిలుస్తోంది. దేశంలోని ప్రముఖ ఆటోటెక్ కంపెనీ అయిన కార్స్24 ప్రీఓన్డ్ కార్లకు నేతృత్వం వహిస్తోంది. 2023వ సంవత్సరంలో హైదరాబాద్‌లో వినియోగించిన కార్ల విక్రయాల పరంగా చూసుకుంటే 156 శాతం పెరుగుదల కనిపించింది.
తక్కువ ఖర్చుతో వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు కావాల్సిన ప్రాధాన్యతలను కల్పిస్తున్న నిర్ధిష్టమైన మార్పును కార్స్24 చూపించగలుగుతోంది. ఈ మేరకు కార్స్24 సహా వ్యవస్థాపకుడు గజేంద్ర జంగిద్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఆటోమొబైల్ రంగం గణనీయంగా వృద్ధి చెందుతుందన్నారు.
శక్తివంతమైన హైదరాబాద్ ఆటోమొబైల్ మార్కెట్‌కు యూజ్డ్ కార్ల విక్రయాలలో కార్స్24 గణనీయమైన పెరుగుదలను అందించడం అశాజనక సూచన అని తెలిపారు. వివిధ రంగాల్లో పునర్నిర్మాణానికి దోహదపడే వినియోగదారుల ఆలోచనలో విస్తృత మార్పును సూచిస్తోందన్నారు. ఈ ధోరణి ప్రాక్టికాలిటీ, వ్యయ ప్రభావంపై పెరుగుతున్న ప్రాధాన్యతను నొక్కి చెబుతుందన్నారు. ఆర్ధిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు దిశను చురుకుగా ప్రభావితం చేయబోతుందన్నారు.