Friday, November 22, 2024

Carona: స్పుత్నిక్ టీకాతో హెచ్ఐవీ ముప్పు ఉంట‌దా.. ఇదే వాస్త‌వం అంటున్న ద‌క్షిణాఫ్రికా

మేడిన్ రష్యా అయిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీతో హెచ్ఐవీ ముప్పు ఉంద‌ని ద‌క్షిణాఫ్రికా సంచలన కామెంట్‌ చేసింది. అందుక‌నే తాము ఆ వ్యాక్సిన్‌కు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేద‌ని తెలిపింది.

అడినోవైరస్ టైప్ 5 వెక్టార్లతో హెచ్ఐవీ ముప్పు ఎక్కువగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అదే వెక్టార్ తో తయారైన స్పుత్నిక్ వ్యాక్సిన్‌తో పురుషుల్లో హెచ్ఐవీ సోకే చాన్స్‌ ఉందని తెలిపింది. కాబట్టి రష్యా వ్యాక్సిన్ ను తాము అనుమతించలేమని దక్షిణాఫ్రికా ఔషధ నియంత్రణ సంస్థ గత తేల్చి చెప్పింది. దానికి సంబంధించిన డేటానూ రష్యా సమర్పించలేదని, ఆ డేటా అందాక‌ టీకా అనుమతులపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.

దక్షిణాఫ్రికా కామెంట్‌తో ఆఫ్రికా దేశమైన నమీబియా స్పుత్నిక్ వ్యాక్సిన్లను తాత్కాలికంగా నిలిపేసింది. ఇప్పటికే అక్కడ జనానికి స్పుత్నిక్ టీకాలు ఇస్తున్న ఆ దేశం.. మధ్యలోనే ఆపేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నమీబియా ఇవాళ ప్రకటన చేసింది.

దక్షిణాఫ్రికా ప్రకటనను పరిగణనలోకి తీసుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చేంత వరకు స్పుత్నిక్ వ్యాక్సిన్ ను నిలిపేస్తున్నామని న‌మీబియా తేల్చి చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement