Friday, November 1, 2024

Canada | స్టడీ పర్మిట్లు తగ్గించిన కెనడా…

దౌత్యపరమైన విబేధాల మూలంగా భారతీయ విద్యార్ధులకు ఇచ్చే స్టడీ పర్మిట్ల సంఖ్యను కెనడా గణనీయంగా తగ్గించింది. 2022లో డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కేవలం 14,910 పర్మిట్లను మాత్రమే జారీ చేసింది. అంతకు ముందు మూడు నెలల వ్యవధిలో ఈ సంఖ్య 1,08,940గా ఉంది. దీంతో పోల్చుకుంటే డిసెంబర్‌లో ఇచ్చిన పర్మిట్లలో 86 శాతం తగ్గుదల నమోదైంది.

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు భారతీయ ఏజెంట్లే కారణమంటూ కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో చేసిన నిరాధార ఆరోపణలు ఇరు దేశాల మధ్య తీవ్ర విబేధాలకు దారితీసింది. దీంతో ఢిల్లిలోని తమ రాయబారులను భారీ సంఖ్యలో తగ్గించుకోవాలని భారత ప్రభుత్వం కోరింది. దీంతో కెనడా 41 మంది దౌత్య అధికారులను వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలోనే పెద్ద సంఖ్యలో స్టడీ పర్మిట్లను ప్రాసెస్‌ చేయడం కుదరడంలేదని ఆ దేశ ఇవిగ్రేషన్‌ మంత్రి మార్క్‌ మిల్లర్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

భవిష్యత్‌లో ఈ పర్మిట్ల జారీని గణనీయంగా పెరిగే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. కెనడాలో ఉన్నత విద్య కోసం వెళ్తున్న వారిలో భారతీయ విద్యార్ధులు గణనీయంగా ఉంటున్నారు. 2022లో 2,25,835 స్టడీ పర్మిట్లు జారీ చేయగా అందులో 41 శాతం భారతీయ విద్యార్ధులే ఉన్నారు. కెనడాలో చాలా యూనివర్శిటీలకు విదేశీ విద్యార్ధులు ప్రధాన ఆయన వనరుగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement