Tuesday, November 19, 2024

TRAI | త్వ‌ర‌లో “కాల‌ర్ ఐడెంటిఫికేష‌న్” ఫీచ‌ర్‌‌.. టెలికాం కంపెనీలకు ట్రాయ్ సూచన

స్పామ్ కాల్స్‌ను అరికట్టేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కొత్త నిబంధనలను తీసుకువస్తోంది. మొబైల్ ఫోన్‌లకు స్పామ్ కాల్‌ల సమస్యను పరిష్కరించడానికి, మోసాలను నియంత్రించడానికి., భారతదేశ టెలికాం నెట్‌వర్క్‌లో “కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్” సేవను ప్రవేశపెట్టాలని దేశీయ టెలికాం కంపెనీలకు ట్రాయ్ సిఫార్సు చేసింది. ఈ స‌ర్వీస్‌ ప్రకారం, అన్‌నోన్ నెంబర్ల నుంచి కాల్ వస్తే.. మొబైల్ వినియోగదారులు అందించిన డేటాను ఉపయోగించి ‘‘కాలర్ ఐడెంటిఫికేషన్ ఫీచర్’’ డిఫాల్ట్‌గా అందించనుంది.

లోకల్ స్మార్ట్‌ఫోన్ టూల్స్ లేదా ట్రూకాలర్, భారత్ కాలర్ ఐడీ, యాంటీ స్పామ్ వంటి థర్డ్-పార్టీ యాప్‌లు కూడా ఫోన్ కాల్ సమయంలో కాలింగ్ నేమ్ డిస్‌ప్లే చేస్తాయి. స్పామ్ ఐడెంటిఫికేషన్ సౌకర్యాలను కూడా అందిస్తాయి, ఈ సర్వీసులు కేవలం క్రౌడ్-సోర్స్ డేటా ఆధారంగా ఉంటాయి. వీటిని అంతగా నమ్మలేమని ట్రాయ్ భావిస్తోంది.

ఎందుకంటే.. ట్రూకాలర్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ అనేవి.. ఫోన్ కాలర్ తమ కాంటాక్టుల్లో సేవ్ చేసిన పేరు ఆధారంగానే డిస్‌ప్లే అవుతాయి. ఒకవేళ కాంటాక్టు సేవ్ చేయకపోతే ఫోన్ చేసినా కాలర్ నేమ్ కనిపిస్తుంది. అందులో కచ్చితత్వం ఉండదనే వాదన వినిపిస్తోంది. అందుకే ట్రాయ్.. కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ (CNAP) సర్వీస్ ద్వారా డిపాల్ట్ కాల్ ఐడెంటిఫికేషన్ ఫీచర్ అందించనుంది. తద్వారా కాంటాక్టుల్లో ఏ పేరుతో సేవ్ చేసుకున్నప్పటికీ అది కాలర్ నేమ్‌గా కనిపించదు. కొత్త సిమ్ తీసుకునే సమయంలో కస్టమర్ అప్లికేషన్ ఫారం (CAF)లో కస్టమర్ రిజిస్టర్ చేసుకున్న కాలర్ నేమ్ ఆధారంగానే పేరు కనిపించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement