నేడు కూడా లక్షల కోట్లలో నష్టపోయిన మదుపరులు
ముంబై – దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం బలహీనంగా ప్రారంభమై, చివరకు కూడా భారీ నష్టాలతోనే ముగిశాయి. ఈ క్రమంలో ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీతోపాటు సూచీలు మొత్తం రెడ్‌లోనే ముగిశాయి. ఈ నేపథ్యంలో నిఫ్టీ 50 ముగింపులో 18.95 పాయింట్లు క్షీణించి 23,688.95 స్థాయికి చేరుకోగా, సెన్సెక్స్ 50.62 పాయింట్లు క్షీణించి 78,148.49 వద్ద ముగిసింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 367 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 599 పాయింట్లు పడిపోయింది. దీంతో మదుపర్లు కొన్ని గంటల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలను కోల్పోయారు.
అయితే వరుసగా స్టాక్ మార్కెట్లు మూడో రోజూ పతనం కావడం విశేషం. ఈ క్రమంలో అపోలో హాస్పిటల్, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 నష్టాలతో ముగియగా, ఓఎన్జీసీ, టిసఎస్,, రిలయన్స్, ఐటిసి, ఏషియన్ పెయింట్స్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. ట్రెంట్ వరుసగా నాల్గో రోజు తక్కువగా ట్రైడైంది. ఈ క్రమంలో 52 వారాల గరిష్టం నుంచి 21% తగ్గింది. బుధవారం ఇంట్రా-డే డీల్స్‌లో బిఎస్సీ లో ట్రెంట్ షేర్లు 4 శాతం క్షీణించి రూ. 6,591కు చేరుకున్నాయి. అక్టోబర్ 14, 2024న తాకిన దాని 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.8,345.85 నుంచి 21 శాతం పడిపోయింది.