Saturday, November 23, 2024

Business: అమెరికాలో భారీగా పెరిగిన ద్రవ్యోల్బణం.. 40 సంత్సరాల్లో మొదటిసారి

అమెరికాలో ద్రవ్యోల్బణం 9.1 శాతానికి చేరింది. 1981 నవంబర్‌ తరువాత ఇదే అత్యధికం. అమెరికా కార్మిక శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం జూన్‌లో చమురు ధరలు భారీగా పెరిగాయి. వినియోగదారుల ధరల సూచీ 1.3 శాతం పెరడంతోనే ఈ స్థాయిలో ద్రవ్యోల్బణం నమోదైందని పేర్కొంది. ఆహారం, ఇంధన ధరలు మినహాయించి చూస్తే ఇది 5.9శాతమని నివేదిక తెలిపింది. ఇంథన ధరలు జూన్‌లో 11.2 శాతం పెరిగాయి.

12 నెలల కాలంలో వీటి ధరలు 59.9 శాతం పెరిగాయి. ఉక్రెయిన్‌ సంక్షోభంతో ప్రపంచ వ్యాప్తంగా ఇంథన ధరలు భారీగా పెరిగాయని నివేదిక తెలిపింది. గత నెలలో గ్యాలన్‌ ఇంథనం 5 డాలర్లకు పెరిగింది. అంతకు ముందు నెలతో పోల్చితే జూన్‌లో ఆహారం, హౌస్సింగ్‌ ధరలు కూడా పెరిగాయని నివేదిక తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement