విమానయాన ప్రయాణికులకు స్పైస్‌జెట్ ఆకర్షీణీయ ఆఫర్‌ను ప్రకటించింది. డిమాండ్‌తో పాటు సమయానుకూలంగా వేగంగా మారుతున్న టిక్కెట్ రేట్లపై కీలక ప్రకటన చేసింది. టిక్కెట్ ధరను లాక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు గురువారం చెప్పింది. ఇందుకోసం స్పైస్లాక్ అనే సదుపాయాన్ని తీసుకొచ్చింది. దీనిద్వారా 48 గంటలపాటు టిక్కెట్ ధరను లాక్ చేసుకునే వీలుంటుంది. ఈ ఫీచర్ ద్వారా బుక్‌చేసుకున్న టిక్కెట్ 48 గంటలు వేరొకరికి విక్రయించబడదు.
అలాగే చార్జీల పెరుగుల కూడా ఉండదు. దేశీయ, అంతర్జాతీయ సర్వీసులకు ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొంది. దేశీయ విమానాలకు 7 రోజుల ముందు, అంతర్జాతీయ విమానాలకు 15 రోజులముందు వరకు మాత్రమే ఈ సదుపాయం లభిస్తుంది. ఇందుకోసం ప్రారంభధర రూ. 99 చెల్లించాల్సి ఉంటుంది.