Friday, October 18, 2024

Bullion Market – షాకిస్తున్న బంగారం .. రోజు రోజుకి పెరుగుతున్న ధర

రోజు రోజుకి పైపైకి..
నేడు 10 గ్రాములు బంగారం ధ‌ర రూ.74,020
శ్రావ‌ణ మాసానికి రూ .80 వేల‌కు చేర‌డం త‌ధ్యం .

బంగారం వినియోగ‌దారుల‌కు షాకిస్తున్న‌ది.. సాదార‌ణంగా ఆషాడ మాసంలో బంగారం ధ‌ర‌లు నిల‌క‌డ‌గా ఉంటాయి .. విచిత్రం ధ‌ర‌లు రోజు రోజుకి పై పైకి పోతున్నాయి .. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.380 పెరగ్గా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.350 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,850గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (999 గోల్డ్) ధర రూ.74,020గా ఉంది. దాంతో మరోసారి 74 వేల మార్కును దాటింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

- Advertisement -

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,000 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.74,170గా నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.67,850గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.74,020గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.68,300గా.. 24 క్యారెట్ల ధర రూ.74,510గా నమోదైంది. బెంగళూరు, కోల్‌కతా, పూణే, కేరళ, హైదరాబాద్​, విజయవాడ, విశాఖలలో 22 క్యారెట్ల ధర రూ.67,850 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.74,020గా ఉంది.

స్ప‌ల్లంగా త‌గ్గిన వెండి ధ‌ర

వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.200 తగ్గి.. రూ.95,000గా నమోదైంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.95,000గా ఉండగా ముంబైలో సైతం రూ.95,000గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.99,500లుగా నమోదవగా.. బెంగళూరులో అత్యల్పంగా రూ.94,250గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ.99,500లుగా నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement