ముంబై – నేడు దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించింది. ఐటీ స్టాక్స్‌పై కొనసాగుతున్న ఒత్తిడి మధ్య, బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం గ్రీన్ జోన్‌లో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా పెరుగుదలతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అయితే ట్రేడింగ్ ప్రారంభ నిమిషాల్లో లాభాలు పరిమితమయ్యాయి. ఉదయం 9.20 గంటలకు సెన్సెక్స్ 130 పాయింట్ల లాభంతో 65,640 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 50 పాయింట్లు బలపడి 19,575 పాయింట్ల దగ్గర ఉంది. ప్రీ-ఓపెన్ సెషన్‌లో బుల్లిష్‌నెస్ సంకేతాలు కనిపించాయి. ప్రీ-ఓపెన్ సెషన్‌లో, సెన్సెక్స్ దాదాపు 250 పాయింట్లు, నిఫ్టీ కూడా దాదాపు 60 పాయింట్లు పెరిగాయి. గిఫ్ట్ సిటీలో నిఫ్టీ ఫ్యూచర్స్ కూడా గ్రీన్ జోన్‌లో ఉన్నాయి. గత మూడు రోజులుగా నష్టాలలో పయనించిన స్టాక్ మార్కెట్ నేడు లాభాల భాటలోకి రావడంతో మదుపరులు ఊపిరిపీల్చుకున్నారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement