Friday, November 22, 2024

బుల్‌ జోరు, సెన్సెక్స్‌ 1040.. నిఫ్టీ 312 పాయింట్లు వృద్ధి

భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడ్‌ వడ్డీ రేటు నిర్ణయించనున్న నేపథ్యంలో ఫెడ్‌ వడ్డీ రేటుకు ముందు భారీగా కొనుగోళ్లకు మద్దతు కనిపించింది. ఐదు రోజుల పాటు వరుసగా లాభపడిన మార్కెట్లు మంగళవారం భారీగా నష్టపోయాయి. మంగళవారం ఇన్వెస్టర్లకు నష్టాలు మిగిల్చిన సూచీలు బుధవారం లాభాల పంటను పండించాయి. ఉదయం జోరుగా ప్రారంభమైన మార్కెట్లు, ఏ దశలోను తగ్గలేదు. అంతర్జాతీయ మార్కెట్లు కూడా బుధవారం సానుకూలంగా కదలాడాయి. టెక్‌ స్టాక్స్‌ లిస్టింగ్‌ విషయంలో అమెరికా, చైనా మధ్య సయోధ్య కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో చైనా, హాంగ్‌కాంగ్‌ సూచీలు భారీ లాభాలు నమోదు చేశాయి.

జపాన్‌, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా మార్కెట్లు పరుగు పెట్టాయి. అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ సమావేశ నిర్ణయాలు త్వరలో వెలువడనున్నాయి. వడ్డీ రేట్ల పెంపు 50 బేసిస్‌ పాయింట్లకు బదులు 25 బేసిస్‌ పాయింట్లు పెంచుతారనే సంకేతాలు రావడంతో మార్కెట్‌ పుంజుకుంది. దేశీయ మార్కెట్‌ అనిశ్చితిని అంచనా వేసే వోలాటిలిటీ ఇండెక్స్‌ కూడా దిగి వచ్చింది. దీంతో మార్కెట్‌ త్వరలో స్థిరీకరించుకునే పరిస్థితి ఉందనే అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి. ఉక్రెయిన్‌-రస్యా చర్చలు కొలిక్కి వచ్చే సంకేతాలు వెలువడటంతో అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ (1.86 శాతం) 1,040 పాయింట్లు లాభపడి 56,816 పాయింట్ల వద్ద, నిప్టీn (1.87 శాతం) 312 పాయింట్లు లాభపడి 16,975 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ ఉదయం 56,555 పాయింట్ల వద్ద ప్రారంభమై, 56,860 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,389 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిప్టీn 16,876 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,987 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,837 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

పేటీఎం జంప్‌
పేటీఎం స్టాక్‌ ధర 7 శాతానికి పైగా లాభపడింది. క్రితం సెషన్‌లో రూ.592 వద్ద ముగిసిన ఈ స్టాక్‌ బుధవారం 364.80 వద్ద ముగిసింది. పేటీఎం మార్కెట్‌ క్యాప్‌ రూ.41.15 వేల కోట్లకు పెరిగింది. 3534 స్టాక్స్‌ ట్రేడ్‌ కాగా, 2306 స్టాక్స్‌ లాభాల్లో, 1128 స్టాక్స్‌ నష్టాల్లో, 100 స్టాక్స్‌లో ఎలాంటి మార్పు లేకుండా ముగిశాయి. 112 స్టాక్స్‌ 52 వారాల గరిష్టాన్ని, 23 స్టాక్స్‌ 52 వారాల కనిష్టాన్ని తాకాయి. 18 స్టాక్స్‌ అప్పర్‌ సర్క్యూట్‌ను, 7 స్టాక్స్‌ లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement