ఆపిల్ కంపెనీ ఇటీవలే ఐఫోన్ 15 సిరీస్ ని ప్రకటించింది. ఇక ఇప్పుడు కంపెనీ వచ్చే వారం కొత్త ప్రొటక్ట్స్ ని ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. తాజా టెక్ వచ్చిన నివేదిక ప్రకారం, కంపెనీ అక్టోబర్ 17న లేటెస్ట్ ఐప్యాడ్ లైనప్‌ను ఆవిష్కరించనున్నట్టు తెలుస్తుంది. వివరాలు ఇలా ఉన్నాయి..
లీక్‌ల ప్రకారం.. రాబోయే ఈవెంట్ లో కంపెనీ ప్రధానంగా ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ మినీ & బేస్ మోడల్ ఐప్యాడ్‌పై దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఐప్యాడ్ లలో కేవలం డిజైన్ కాస్మెటిక్ మార్పులు జరగవచ్చు.. కొత్త ఐప్యాడ్లలో హార్డ్‌వేర్ పరంగా అప్గ్రేడ్లను జరిగే అవకాశం ఉందని తెలుస్తొంది.
దాదాపు మూడు సంవత్సరాల క్రితం లాంచ్ అయిన ఐప్యాడ్ ఎయిర్, M1 చిప్‌తో రన్ అవుతోంది. కాగా, Apple అప్ కమింగ్ ఈవెంట్ లో ఈ మోడల్‌ను M2 చిప్‌కి అప్‌గ్రేడ్ చేయడంతో పాటు పనితీరు, సామర్థ్యంలో చెప్పుకోదగ్గ అప్ డేట్స్ ని ఆశించవచ్చు. అదేవిధంగా ఐప్యాడ్ మినీ లో ప్రస్తుతం ఉన్న A15 బయోనిక్ చిప్‌ని A16 అప్‌గ్రేడ్‌ని చేసే చాన్స్ ఉంది. ఇక దీంతో పాటు బేస్ మోడల్ ఐప్యాడ్ కూడా అప్‌గ్రేడ్స్ కి లైన్లో రెడీగా ఉంది.
మరింత బడ్జెట్ ఫ్రెండ్లీ మోడళ్లకు ప్రాధాన్యతనిస్తూ తన ఐప్యాడ్ లైనప్‌ను కొత్తగా మార్చాలని Apple నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించడానికి కంపెనీ అనుగుణంగా ఉంటుంది. అంతే కాకుండా, విస్తృత శ్రేణి వినియోగదారులకు అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఆపిల్ కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.