ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ మార్కెట్‌లో మరో కొత్త బ్రాడ్ బ్రాండ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా దీన్ని ప్రకటించింది. కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ప్లాన్‌ను ప్రకటించింది. 75 రోజులకు బ్రాడ్ బ్రాండ్‌ను 275 రూపాయలకు అందిస్తున్నట్లు తెలిపింది. కొత్తగా కనెక్షన్ తీసుకునే వినియోగదారులకు ఇది వర్తిస్తుంది. తొలి 75 రోజులకు 275 రూపాయలు మాత్రమే వసూలు చేస్తారు. అనంతరం ప్లాన్ ప్రకారం చెల్లించాల్సి ఉంటుందని బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది. ఎంట్రీ లెవల్ పథకాలపై 449, 599 ప్లాన్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. 449 ప్లాన్‌పై 30 ఎంబీపీఎస్ వేగంతో 3.3 టీబీ నెలవారీ డేటా పొందవచ్చు. డేటా పరిమితి తరువాత వేగం 2 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. 599 ప్లాన్‌పై 60 ఎంబీపీఎస్ వేగంతో 3.3 టీబీ డేటాను పొందవచ్చు.
నెలవారీ పరిమితి దాటిన తరువాత వేగం 2 ఎంబీపీఎస్‌కు పడిపోతుంది. దీంతో పాటు 999 ప్లాన్‌పై కూడా ఆఫర్ ప్రకటించింది. దీని ప్ర్‌కారం తొలి 75 రోజులకు 775 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లో 150 ఎంబీపీఎస్ వేగంతో డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో ఓటీటీ ప్రయోజనాలను కూడా సంస్థ అందిస్తోంది. డిస్ని ప్లస్ హాట్ స్టార్, హంగామా, సోనీలివ్, జీ5, వూట్, యుప్‌టీవీ, లాయన్స్‌గేట్ ఓటీటీలు ఫ్రీగా లభిస్తాయి. ఈ ప్లాన్‌లన్నీ సెప్టెంబర్ 13 వరకు అందుబాటులో ఉంటాయని బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది.