Friday, November 22, 2024

బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ టీసీఎస్‌ సేవలు

దేశవ్యాప్తంగా 4జీ సేవల విస్తరణ దిశగా బీఎస్‌ఎన్‌ఎల్‌ ముందడుగేసింది. టాటా కన్సల్టెన్సీతో రూ.26,281 కోట్ల ఒప్పందం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఒప్పందంలో భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ కోసం టీసీఎస్‌ 4జీ లైన్లను ఏర్పాటు చేసి 9ఏళ్లపాటు నిర్వహించనుంది. టీసీఎస్‌కు తక్షణమే బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి రూ.10వేల కోట్ల విలువచేసే ఆర్డర్‌ అందనుంది. దీంతో డిసెంబర్‌ 2022 చివరికల్లా దేశమంతటా 4జీ సేవలు ప్రారంభించే అవకాశం ఉంది. టాటా సన్స్‌కుచెందిన అనుబంధ సంస్థ తేజస్‌ నెట్‌వర్క్‌ స్థానికంగా 4జీ నెట్‌వర్క్‌ ఏర్పాటు కోసం కావాల్సిన పరికరాలను తయారు చేయనుంది.

ఆర్డర్‌ అందించిన 12 నెలల్లోపే కీలక పరికరాలను సరఫరా చేస్తామని టీసీఎస్‌ ఇటీవల తెలిపింది. రేడియో పరికరాలను అందించడానికి 24 నెలల వరకు సమయం పడుతుందని పేర్కొంది. వచ్చే ఏడాదిలోనే 5జీ సేవల్ని ప్రారంభించేందుకు కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రణాళికలు రచిస్తోంది. 2023 ఆగస్టు నాటికి 5జీ సేవలు అందుబాటు లోకి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వరంగ టెలికం సంస్థ తెలిపింది. 4జీ, 5జీ సేవలు అందుబాటులోకి వస్తే వినియోగదారుల వలసలు తగ్గుతాయని బీఎస్‌ఎన్‌ఎల్‌ భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement