Wednesday, October 2, 2024

BSNL | గుడ్‌న్యూస్‌.. ఆగస్టు నుంచి 4జీ సేవలు

భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ త్వరలో యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పనుంది. బీఎన్‌ఎస్‌ఎల్‌ 4జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆగస్టు నాటికి 4G సేవలను లాంచ్‌ చేయనుంది. గతంలోనూ 4జీ సేవలు ప్రారంభంపై వార్తలు వచ్చినా.. తాజాగా BSNL సంస్థ 4జీ ప్లాన్స్‌ను సైతం ప్రకటించింది. ఈ మేరకు సంస్థ సోషల్‌ మీడియా వేదికగా ఈ ప్లాన్స్‌ వివరాలను వెల్లడించింది.

పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారుచేసి టెస్టింగ్‌ స్టేజ్‌లో 700- 2100 MHz స్పెక్ట్రమ్‌ బ్యాండ్‌లో 4G నెట్‌వర్క్‌తో 40- 45 MBPS డేటా వేగాన్ని రికార్డు చేసినట్లు సమాచారం. గత సంవత్సరం జులైలో పంజాబ్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌ తన 4G నెట్‌వర్క్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

దీంతో దేశవ్యాప్తంగా ఆగస్టు నుంచి BSNL 4G Services ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఆత్మనిర్బర్ విధానంలో రూపొందిన ఈ 4G టెక్నాలజీని సులభంగా 5G అప్‌గ్రేడ్‌ అయ్యేలా రూపొందించారు. దీంతోపాటు 4G, 5G సేవల కోసం దేశవ్యాప్తంగా 1.12 లక్షల టవర్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇక BSNL సంస్థ గత 4 -5 ఏళ్ల నుంచే 4G సిమ్‌ కార్డులను విక్రయిస్తోంది.

BSNL 4G services ప్లాన్స్‌ ఇవే:

  • PV2399 : ఈ రూ.2,399 ప్లాన్‌ 395 రోజుల వాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్‌తో ప్రతిరోజూ 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, 2జీబీ డేటా పొందొచ్చు.
  • PV1999 : ఈ ప్లాన్ 600GB డేటాతో పాటు 365 రోజుల చెల్లుబాటు అవుతుంది. 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ ఉంటుంది.
  • PV997 : ఈ ప్లాన్ 160 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 2జీబీ డేటాతో పాటు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి.
  • STV599 : ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిటీ ఉంటుంది. అపరిమిత కాలింగ్‌తో పాటు రోజుకు 3జీబీ డేటా పొందొచ్చు.
  • STV347 : ఈ ప్లాన్‌ 54 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతిరోజూ 2జీబీ డేటాతో పాటు 100 ఉచితంగా ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయం ఉంటుంది.
  • PV199 : ఈ ప్లాన్‌ 30 రోజుల వ్యాలిడిటీతో ఉంటుంది. ఇది రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్, 100 ఉచిత ఎంఎంఎస్‌లు వస్తాయి.
  • PV153 : ఈ ప్లాన్‌ 26 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. మొత్తం 26 జీబీ డేటా, 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత కాలింగ్‌ ఉంటుంది.
  • STV118 : ఈ ప్లాన్‌ 20 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే.. 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, 10 జీబీ డేటా పొందొచ్చు.
Advertisement

తాజా వార్తలు

Advertisement