Friday, November 22, 2024

BSE – స్టాక్‌ మార్కెట్‌ బుల్ జోరు … తొలి సెషన్ లో ఫుల్ జోష్

స్టాక్‌మార్కెట్‌ సూచీలు గురువారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ 117 పాయింట్లు లాభపడి 23,435కు చేరింది. సెన్సెక్స్‌ 370 పాయింట్లు ఎగబాకి 76,984 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 104.5 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 82.4 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.3 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి.

ఎస్‌ అండ్‌ పీ 0.85 శాతం, నాస్‌డాక్‌ 1.53 శాతం లాభాల్లోకి చేరాయి.డిపాజిట్‌ రేట్లు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని, మధ్య కాలికంగా తగ్గే అవకాశం ఉందని ఎస్‌బీఐ చైర్మన్‌ దినేష్‌ కుమార్‌ ఖారా విశ్లేషించారు. ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తే..ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ త్రైమాసికం నుంచి ఆర్‌బీఐ కూడా తన వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement