దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సూచీల ప్రతికూల ప్రభావం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలపై పడింది. ఈరోజు ఉదయం 52,606 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ వెంటనే ఇన్వెస్టర్లు అమ్మకాలు ప్రారంభించడంతో వరుసగా పాయింట్లు కోల్పోతూ కనిష్టంగా 52,506 పాయింట్లకు పడిపోయింది. గరిష్టంగా 52,703 పాయింట్లను తాకింది. గత శుక్రవారం ఐపీవోకి వచ్చిన తత్వ చింతన్ ఫార్మాకి మంచి స్పందన వస్తోంది. జీఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లీన్ సైన్స్ ఈ రోజు స్టాక్ మార్కెట్లో అడుగు పెడుతున్నాయి. ఈ రెండు ఐపీవోలకు మంచి స్పందన రావొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇది కూడా చదవండి : హౌస్ అరెస్ట్ పై లోక్ సభ స్పీకర్ కు రేవంత్ ఫిర్యాదు