Wednesday, November 20, 2024

సులభతర వాణిజ్యంలో బ్రాడ్‌ కాస్ట్‌ సేవా పోర్టల్‌.. లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు వేగవంతం

ప్రసార రంగంలో సులభతర వాణిజ్యంలో కొత్త అధ్యాయానికి నాంది పలికామని, బ్రాడ్‌ కాస్ట్‌ సేవా పోర్టల్‌ ద్వారా.. వివిధ రకాల లైసెన్సులు, అనుమతులు, రిజిస్ట్రేషన్‌లు, ఫైలింగ్‌తో పాటు ప్రాసెస్‌లు వేగవంతంగా చేయవచ్చని కేంద్ర సమాచార, ప్రసార, క్రీడా శాఖ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ అన్నారు. ఢిల్లిలోని బ్రాడ్‌ కాస్ట్‌ సేవా పోర్టల్‌ను ఆయన సోమవారం ప్రారంభించి మాట్లాడారు. సాంకేతికత సాయంతో వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడానికి, మరింత జవాబుదారీతనం కోసం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. బ్రాడ్‌కాస్ట్‌ సేవా పోర్టల్‌ అప్లికేషన్‌ల నిర్వహణ సమయాన్ని తగ్గిస్తుందని, అదే సమయంలో దరఖాస్తుదారులు పురోగతిని ట్రాక్‌ చేయడంలో సహాయపడుతుందని, ఈ పోర్టల్‌ ఇది వరకు అవసరమైన మానవ ప్రమేయాన్ని తగ్గిస్తుందన్నారు. తద్వారా.. మంత్రిత్వ శాఖ సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని, సులభతర వాణిజ్యం కోసం ఇది ఓ ప్రధాన అడుగు అవుతుందని అభిప్రాయపడ్డారు.

లెక్కింపు, చెల్లింపులు సులభతరం
వాటాదారుల అనుమతుల కోసం, రిజిస్ట్రేషన్‌, దరఖాస్తు ప్రక్రియ, దరఖాస్తులను ట్రాక్‌ చేయడం, ఫీజుల లెక్కింపు, చెల్లింపులను అమలు చేయడం వంటి వాటిని సులభతరం చేయడం కోసం డిజిటల్‌ పరిష్కారాలను చూపుతుందని ఠాగూర్‌ వివరించారు. ఈ పోర్టల్‌ ప్రైవేటు శాటిలైట్‌ టీవీ ఛానెల్‌లు, టెలిపోర్ట్‌ ఆపరేటర్లు, ఎంఎస్‌ఓలు, కమ్యూనిటీ, ప్రైవేటు రేడియో ఛానెల్‌లు మొదలైన అన్ని వాటాదారులకు డిజిటల్‌ భారత్‌ విస్తృత ప్రయోజనాలను ఈ సేవల ద్వారా అందిస్తుందన్నారు. ఈ పోర్టల్‌ ప్రధాని మోడీ.. కనీస ప్రభుతం, గరిష్ట పాలన మంత్రాన్ని సాకారం చేయడంలో కీలక ముందడుగు అని, ఈ సరళమైన, వినియోగదారు స్నేహ పూర్వక వెబ్‌ పోర్టల్‌ ప్రసారకులకు కేవలం ఒక్క మౌస్‌ క్లిక్‌తో ఎండ్‌ టు ఎండ్‌ పరిష్కారాన్ని అందిస్తుందని తెలిపారు. ఇది 900కు పైగా శాటిలైట్‌ టీవీ ఛానెల్స్‌, 70 టెలిపోర్ట్‌ ఆపరేటర్లు, 1700 మల్టిd సరీస్‌ ఆపరేటర్లు, 350 కమ్యూనిటీ రేడియో స్టేషన్‌లు (సీఆర్‌ఎస్‌), 380 ప్రైవేటు ఎఫ్‌ఎం ఛానెల్స్‌, ఇతరులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చడం ద్వారా మొత్తం బ్రాడ్‌కాస్ట్‌ రంగాన్ని బలోపేతం చేస్తుందన్నారు.

ఒకే డ్యాష్‌ బోర్డుపై మొత్తం సమాచారం
పోర్టల్‌ టెస్టు రన్‌కు అంతిమ వినియోగదారుల నుంచి సానుకూల స్పందన వచ్చినట్టు మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. తరలోనే ఈ పోర్టల్‌ నేషనల్‌ సింగిల్‌ విండో సిస్టమ్‌కు అనుసంధానం కానుంది. పరిశ్రమ అవసరమని భావించే మరిన్ని మెరుగుదలకు మంత్రిత శాఖ సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. కొత్త పోర్టల్‌ ముందు వెర్షన్‌ కంటే అనేక రెట్లు బాగుందని, ఒక నెల ట్రయల్‌ వ్యవధిలో వాటాదారుల నుంచి వచ్చిన సూచనలను పొందుపర్చినట్టు తెలిపారు. ఈ పోర్టల్‌ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, ప్రతిస్పందనను తీసుకువస్తుంది. మొత్తం సమాచారం ఒకే డ్యాష్‌ బోర్డుపై లభ్యం అవుతుంది. పేమెంట్‌ సిస్టమ్‌తో ఇంటిగ్రేషన్‌, ఈ-ఆఫీస్‌, భాగస్వామ్య మంత్రిత్వ శాఖలతో ఇంటిగ్రేషన్‌, అనలిటిక్స్‌, రిపోర్టింగ్‌, మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ వంటి సేవలు ఈ కొత్త పోర్టల్‌ నుంచి అందుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement