Tuesday, November 19, 2024

తెలంగాణలో సోలార్ ఎనర్జీని పెంచేందుకు విస్తృత చ‌ర్య‌లు.. రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి

హైదరాబాద్ : రాష్ట్రంలో సోలార్ ఎనర్జీని మరింత పెంచేందుకు కృషి చేస్తున్నట్టు వెల్ల‌డించారు తెలంగాణ రెన్యూయెబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వై.సతీశ్ రెడ్డి. రాష్ట్రంలో సోలార్ రంగంలో ఉన్న సంస్థల ప్రతినిధులతో హైదరాబాద్, ఖైరతాబాద్ లో ఉన్న రెడ్కో కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. సోలార్ సంస్థలు ఎదుర్కుంటున్న సవాళ్లు, సోలార్ రంగం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సోలార్ పైకప్పు(సోలార్ రూఫ్ టాప్) ఏర్పాటుపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ వాడకం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు.

ఇక.. సోలార్ నెలకొల్పడంలో, అనుమతుల పరంగా తమకు ఎదురవుతున్న సవాళ్ల గురించి కంపెనీల ప్రతినిధులు రెడ్కో చైర్మన్ సతీశ్ రెడ్డికి వివరించారు. ప్రభుత్వం నుంచి మరింత సహకారం అందించాలని కోరారు. దీనిపై స్పందించిన రెడ్కో చైర్మన్ వై.సతీశ్ రెడ్డి.. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం, రెడ్కో అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. సవాళ్లను అధిగమించి ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఎల్లవేలలా అందుబాటులో ఉంటామని చెప్పారు. రాబోయే రోజుల్లో సోలార్ పవర్ కు డిమాండ్ విపరీతంగా పెరిగబోతోందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని, డిమాండ్ కు తగినట్టుగా సప్లై చేసేలా సన్నద్ధమై ఉండాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement