Friday, November 22, 2024

పన్నుల్లో కోత విధించిన బ్రిటన్.. 50 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు

బ్రిటన్‌ కొత్త ప్రధాన మంత్రి లిజ్‌ ట్రస్‌ వాగ్దానం చేసినట్లుగా పన్ను రేట్లపై దృష్టి సారించారు. తాజాగా పార్లమెంట్‌కు సమర్పించిన మినీ బడ్జెట్‌లో 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీగా పన్నుల్లో కోతలు విధించారు. రాణి ఎలిజిబెత్‌ 2 మరణంతో మినీ బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ఆలస్యమైంది. బడ్జెట్‌ను కొత్త ఛాన్స్‌లర్‌ ప్రవేశపెట్టారు. ఈ పదవీ మంత్రి వర్గంలో ఉన్నస్థాయి కలిగి ఉంటుంది. మినీ బడ్జెట్‌ కొత్త శనానికి సరికొత్త వృద్ధి ప్రణాళిక అని బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్బంగా ఛాన్సలర్‌ క్యాసీ క్వార్టెంగ్‌ వ్యాఖ్యానించారు. వచ్చే సంవత్సరాల్లో 2.5 శాతం వృద్ధి సాధించాలన్న లక్ష్యంతో దీన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఆదాయ పన్నుతో పాటు, ఇంటి కొనుగోలుపై స్టాంప్‌ డ్యూటీని తగ్గించారు. ప్రతిపాదిత వ్యాపార పన్నుల పెంపును రద్దు చేశారు. ప్రధాని లిజ్‌ ట్రస్‌ బ్రిటన్‌ చరిత్రలోనే ఛాన్స్‌లర్‌ పదవిలో ఒక నల్లజాతి మహిళను నియమించారు.

కొత్త ఇంటి కొనుగోలుపై స్టాంప్‌ డ్యూటీ తగ్గించడం వల్ల హౌస్సింగ్‌ రంగం రాణిస్తుందని ఆమె పేర్కొన్నారు. తొలిసారి ఇల్లు కొనుగోలు చేసే వారికి ఇది ప్రోత్సహకరంగా ఉంటుందని చెప్పారు. ఈ రంగంలోకి కొత్త పెట్టుబడులు వస్తాయని తెలిపారు. చాలా కాలంగా ఎలాంటి అభివృద్ధి చెందని రోడ్లు, రైలు, ఇంధన ప్రాజెక్ట్‌ల విషయంలో ఆంక్షలు తొలగించి, వాటిని వేగవంతం చేస్తామన్నారు. సాధారణ వ్యక్తుల కరెంటు బిల్లులపై పరిమితి విధించడంతో పాటు, కంపెనీలకు ఇంధన వ్యయాలను తగ్గించడ వంటి పలు ప్రతిపాదనలు ఇందులో పొందుపరిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement