Saturday, November 23, 2024

వరస లాభాలకు బ్రేక్‌, నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు..

స్టాక్‌మార్కెట్లలో వరస లాభాలకు శుక్రవారం బ్రేక్‌ పడింది. స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలోని బలహీనతలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపాయి. జూన్‌లో నమోదైన కనిష్టాల నుంచి నిఫ్టీ ఇప్పటి వరకు 18 శాతం లాభపడింది. ఈ నేపధ్యంలోనే ఇన్వెస్టర్లు లాభల స్వీకరణకు దిగారని నిపుణులు అభిప్రాయపడ్డారు. డాలర్‌ ఇండెక్స్‌ ఒక నెల గరిష్టానికి చేరుకోవడం కూడా ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచింది. ద్రవ్యోల్బణం ఇంకా నిర్ధేశించిన లక్ష్యం కంటే అధికంగా ఉన్నందున మరోసారి ఆర్బీఐ వడ్డీరేట్లు పెంచనుందన్న వార్తలు కూడా మార్కెట్లను ప్రభావితం చేశాయని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. డీజిల్‌, విమాన ఇంధనం ఎగుమతులపై తాజాగా పెంచిన పన్నులు కూడా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి.

సెన్సెక్స్‌ 651.85 పాయింట్లు నష్టపోయి 59646.15 వద్ద ముగిసింది. నిఫ్టీ 198.05 పాయింట్లు నష్టపోయి 17758.45 వద్ద ముగిసింది. బంగారం 77 రూపాయిలు తగ్గి 51526 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో 1084 రూపాయిలు తగ్గి 55359 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 79.27 రూపాయిలుగా ఉంది.

లాభపడిన షేర్లు..

ఎల్‌ అండ్‌ టీ, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, అదానీ పోర్ట్స్‌, ఐచర్‌ మోటార్స్‌, బజాజ్‌ ఆటో షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు..

- Advertisement -

ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అపోలో హాస్పటల్స్‌, టాటా మోటార్స్‌, టాటా కన్జ్యూమర్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా స్టీల్‌, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, మారుతి సుజుకీ షేర్లు నష్టపోయాయి. స్టాక్‌ మార్కెట్‌లో వరస లాభాలకు బ్రేక్‌ పడటంతో ఇన్వెస్టర్లు 2.85 లక్షల కోట్లు నష్టపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement