టిట్టర్ కొనుగోలు వ్యవహారం మరో మలుపు తిరిగింది. కొద్ది రోజులుగా టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ టిట్టర్ పేరు చాలా వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో కొత్త టిస్టు తెరపైకి వచ్చింది. ప్రైవేటు అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్‌ఎక్స్, ఎలక్ట్రికల్ వెహికిల్స్ తయారీ కంపెనీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేతికి వెళ్లినట్టే వెళ్లిన ఈ బిగ్గెస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ కొనుగోలు ప్రక్రియ అనుకోని అవాంతరాలు వచ్చి పడ్డాయి. కొనుగోలు ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. 44 బిలియ్ డాలర్లకు టిట్టర్‌ను కొనుగోలు చేయనున్నట్టు అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ఇప్పటికే ప్రకటించాడు. దీనికి ఆ కంపెనీ కూడా అంగీకరించింది. మస్క్ చేసిన ప్యాకేజీకి ట్విట్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా అంగీకారం తెలిపారు. ఈ ప్రతిపాదనలకు ఏకగ్రీవంగా ఆమోద ముద్ర కూడా వేశారు. మూడు నెలల్లో కంపెనీ బదలాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. జేపీ మోర్గాన్ వంటి టాప్ ప్లేయర్లు.. యాజమాన్య బదలాయింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నది.
ఇది తాత్కాలికమే.. : ఎలాన్
బదలాయింపు ప్రక్రియ వేగవంతమైన ప్రస్తుత పరిస్థితుల మధ్య ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు. టిట్టర్ కొనుగోలు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఇది తాత్కాలికమే అని కూడా స్పష్టం చేయడం గమనార్హం. సంస్థాగతమైన కొన్ని సమస్యలు పరిష్కరించాల్సి ఉందని, దీనికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అప్పటి వరకు ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టేకోవర్ ప్రక్రియ ముందుకు సాగకపోవచ్చు అని చెప్పారు. టిట్టర్ పాత యాజమాన్యం సూచించిన స్పామ్ లేదా ఫేక్ అకౌంట్స్ లెక్కలపై అనుమానాలు వ్యక్తం కావడంతోనే ఈ డీల్‌ను ఎలాన్ మస్క్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు సమాచారం. మొత్తం అకౌంట్స్‌లో 5 శాతం కంటే తక్కువ నకిలీ యూజర్లు ఉన్నట్టు ఇది వరకు టిట్టర్ మేనేజ్‌మెంట్ తెలియజేసిందని, దీన్ని నిర్ధారించడానికి అవసరమైన వివరణలు ఇంకా అందాల్సి ఉందని, అవి పెండింగ్‌లో ఉన్నాయని ఎలాన్ మస్క్ స్పష్టత ఇచ్చారు. ఈ కారణంతోనే టిట్టర్ కొనుగోలు డీల్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్టు వివరించారు.
ట్విట్టర్ షేర్ 20 శాతం పతనం
కార్పొరేట్ సెగ్మెంట్‌లోనే అతిపెద్ద టేకోవర్‌గా భావిస్తోన్న టిట్టర్ యాజమాన్య బదలాయింపు ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఎలాన్ మస్క్ చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టించింది. ఏకంగా టిట్టర్ కొనుగోలు వ్యవహారాన్ని ఇది నిలిపివేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎలాన్ మస్క్ నుంచి తాజా ప్రకటన వెలువడిన వెంటనే.. టిట్టర్ షేర్లు భారీగా పతనం అయ్యాయి. భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. న్యూయార్క్ స్టాక్ మార్కెట్ నాస్డాక్‌లో ఒక్కో షేర్ ధర 17 నుంచి 20 శాతం వరకు పడిపోయింది. నిజానికి టిట్టర్ కొనుగోలు చేయడానికి మొదట్లో మస్ ్క ఇచ్చిన ఆఫర్ 46.5 బిలియన్ డాలర్లు. డీల్ కుదిరే సమయానికి రెండున్నర బిలియన్ డాలర్ల మొత్తం తగ్గింది. 44 బిలియన్ డాలర్లతో ఈ డీల్ ఓకే అయ్యింది. ఈ టేకోవర్ వ్యవహారంతో ట్విట్టర్ షేర్ హోల్డర్ల పంట పండినట్టే.. ఒక్కో షేరు 54.20 డాలర్లను ఎలాన్ మస్క్ చెల్లిస్తారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎలాన్ మస్క్ ప్రకటించారు.
11 మంది సభ్యలో ట్విట్టర్ బోర్డు
టిట్టర్ బోర్డులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో 11 మంది సభ్యులు ఉన్నారు. టిట్టర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్య కార్యనిర్వాహణాధికారి జేక్ డోర్సీ ఇందులో ఒకరు. ఎలాన్ మస్క్ ఇచ్చిన ఆఫర్‌పై సమగ్రంగా సమీక్ష, అధ్యయనం చేసింది. దీని కోసం జేపీ మోర్గాన్ అండ్ కంపెనీని నియమించుకుంది. ఈ కంపెనీ నుంచి అందిన నివేదికపై సమగ్రంగా సమీక్షించింది. అనంతరం మస్క్ ఇచ్చిన ఆఫర్‌పై ఆమోద ముద్ర వేసింది. ట్విట్టర్ బోర్డ్ డైరెక్టర్లందరూ.. ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఎవరూ ఎలాంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేయలేదు.
వీడుతున్న సీనియర్లు
టిట్టర్ కంపెనీలో అలజడి మొదలైంది. ఎలాన్ మస్క్ ఇప్పటికే ఉద్యోగుల కోత ప్రారంభించినట్టు తెలుస్తోంది. కంపెనీలో నుంచి ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ సంస్థను విడిచిపెట్టి వెళ్లిపోతున్నట్టు టిట్టర్ వెల్లడించింది. దీనికితోడు కొత్త నియామకాలు కూడా ఇప్పటికే నిలిచిపోయాయి. రీసెర్చ్, డిజైన్ మేనేజర్ కేవోన్ బేక్‌పూర్‌తో పాటు ప్రొడక్ట్ హెడ్ బ్రూస్ ఫాల్క్‌లు కంపెనీని వీడారు. రానున్న రోజుల్లో మరికొంత మంది కంపెనీని వీడుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. కంపెనీలోని కీలక పదవులకు తప్ప.. మిగిలిన విభాగాల్లో నియామకాలు పూర్తి స్థాయిలో తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ట్విట్టర్ వెల్లడించింది. ఇది వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.