Tuesday, November 19, 2024

బీపీసీఎల్‌ ఈవీ ఫాస్ట్‌ ఛార్జీంగ్‌ స్టేషన్లు.. దశలవారిగా 7వేల కేంద్రాల్లో ఏర్పాటు

భారత్‌ పెట్రోలియం కార్పోరేషన్‌ లిమిటెడ్ (బీపీసీఎల్‌) రెండు క్యారిడార్స్‌లో 200 ఫాస్ట్‌ ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఇందు కో సం కంపెనీ 500 కోట్లు పెట్టుబడి పెడుతుందని కంపెనీ సౌత్‌ రిటైల్‌ హెడ్‌ పుషప్‌ కుమార్‌, కంపెనీ రిటైట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పీఎస్‌ రవి తెలిపారు. బెంగళూర్‌-చెన్నయ్‌, బెంగళూర్‌-మైసూర్‌-కూర్గ్‌ ఈ రెండు క్యారిడార్స్‌లో ముందుగా ఈ ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో దేశంలోని పలు హైవే క్యారిడార్స్‌లో మరో 200 ఫాస్ట్‌ ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.

మూడు సవాళ్లు

ఈవీ రంగంలో మూడు సవాళ్లను కంపెనీ గుర్తించిందని వారు చెప్పారు. ఒక సారి ఛార్జింగ్‌తో ఎంత దూరం ప్రయాణించవచ్చు, ఛార్జింగ్‌ స్టేషన్లు ఎక్కడ ఉన్నాయన్నది తెలుసుకోవడం, ఛార్జింగ్‌ చేసేందుకు పట్టే సమయం. ఈ మూడు సవాళ్లను దృష్టిలో పెట్టుకుని కంపెనీ ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తుందని వివరించారు. ప్రతి స్టేషన్‌లోనూ 25 కేవీ సామర్ధ్యంతో ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను నెలకొల్పనున్నామని, వాహనానికి పూర్తి ఛార్జింగ్‌ చేసేందుకు 30 నిముషాల సమయం సరిపోతుందని పీఎస్‌ రవి వివరించారు. ఈ రెండు క్యారిడార్స్‌లో ప్రతి 100 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్‌ స్టేషన్‌ను రోడ్డుకు రెండు వైపులా ఏర్పాటు చేస్తామని చెప్పారు.

- Advertisement -

డిజిటల్‌ పేమెంట్స్‌

కంపెనీ ఏర్పాటు చేస్తున్న అన్ని ఛార్జింగ్‌ స్టేషన్లలో డిజిటల్‌ చెల్లింపు విధానాన్ని ప్రవేశపెట్టనుంది. కస్టమర్లు కంపెనీ యాప్‌ హలోబీపీసీఎల్‌ ను ఉపయోగించి మొబైల్‌ ఫోన్ల నుంచే చెల్లించవచ్చని తెలిపారు. అన్ని సెల్ఫ్‌ ఛార్జింగ్‌ స్టేషన్లుగా ఉంటాయని, అవసరమైతే సిబ్బంది సహకరిస్తారని చెప్పారు. దశలవారిగా దేశంలోని అన్ని జాతీయ రహదారుల వెంట, ఎకనామిక్‌ సెంటర్స్‌లో బీపీసీఎల్‌ ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది.

7 వేల ఎనర్జీ స్టేషన్స్‌

బీపీసీఎల్‌ దేశంలోని తనకు ఉన్న 7వేల పెట్రోల్‌ బంక్‌ల్లో ఈవీ ఛార్జింగ్‌ సదుపాయలను కల్పించడంతో పాటు, ఇతర ఇంధనాలను కూడా సరఫరా చేయాలని నిర్ణయించింది. జాతీయ రహదారుల వెంట ఉన్న బంక్‌ల్లో ఇన్‌ అండ్‌ అవుట్‌ రిటైల్‌ స్టోర్స్‌ను ఏర్పాటు చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement