టాటా మోటర్స్ మార్కెట్లో ప్రవేశపెట్టిన టియాగో ఈవీ కారుకు భారీ స్పందన వచ్చింది. బుకింగ్స్ ప్రారంభించిన సోమవారం ఒక్క రోజే 10వేల కార్ల బుకింగ్స్ వచ్చాయని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర చెప్పారు. మొదటి 10 వేల బుకింగ్స్‌కు కారును 8.49 లక్షలకే ఇస్తామని కంపెనీ ప్రకటించింది. కస్టమర్లు చూపించిన ఈ అభిమానంతో ఈ ఆఫర్‌ను మరో 10 వేల కస్టమర్లకు పొడిగించినట్లు చెప్పారు.
కస్టమర్ల నుంచి అనుహ్యమైన స్పందన వచ్చిందని, అందువల్లే మరో 10 వేల కస్టమర్లకు కూడా ఇదే ధరలో టియాగోను ఇవ్వాలని నిర్ణయించామని ఆయన ప్రకటించారు. టాటా టియాగో ఈవీ కారు రెండు బ్యాటరీ ప్యాక్స్‌తో వస్తోంది. 25 కిలోవాట్స్ బ్యాటరీతో వచ్చే కారు 315 కిలోమీటర్లు, 19.2 కిలోవాట్స్ బ్యాటరీతో వచ్చే కారు 250 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. 25 వేలు చెల్లించి కస్టమర్లు టియాగో కారును బుక్ చేసుకోవచ్చు.