అంతర్జాతీయంగా ప్రతికూలతలు, పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో దేశీయ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకులు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 397 పాయింట్లు నష్టపోయి 50,395కు పడిపోయింది. నిఫ్టీ 101 పాయింట్లు కోల్పోయి 14,929కి దిగజారింది. టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ టాప్ గెయినర్స్ కంపెనీల లిస్ట్ లో మొదటి వరుసలో ఉన్నాయి. బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఆటో, బజాప్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, ఏసియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement