ప్రముఖ వాహన తయారీ సంస్థ BMW గురువారం ప్రీమియం బైక్ మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ‘M 1000 RR’అనే ఈ మోడల్ బైక్ ధరను రూ. 42 లక్షలు(ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది. ప్రీమియం ఫీచర్లతో లభించే ఈ బైక్ నాలుగు రకాల రైడింగ్ మోడ్స్లలో లభించనుంది. భారత్‌లోని BMW నుంచి వచ్చిన మొదటి ‘M మోడల్’ బైక్ ఇదని, దీన్ని BMW మోటారాడ్ డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చని BMW గ్రూప్ ఇండియా వెల్లడించింది. ఈ బైక్ రెండు వేరియంట్లలో లభించనుండగా BMW M 1000 RR ధర రూ. 42 లక్షలు ఉండగా, BMW M 1000 RR కాంపిటీషన్ ధర రూ. 45 లక్షలతో లభిస్తుంది.
ఈ బైక్ మెరుగైన పనితీరుతో బైక్ రేస్ అనుభూతిని ఇస్తుందని BMW ఇండియా గ్రూప్ ప్రెసిడెంట్ విక్రమ్ పవా తెలిపారు. ఈ సరికొత్త మోడల్లో శక్తివంతమైన ఇంజిన్‌తో పాటు అధునాతన డైజైన్, ప్రత్యేకమైన పరికరాలతో తయారు చేయబడిందని పేర్కొన్నారు. 999 సీసీ, 4-సిలిండర్ఇం జిన్‌తో నడిచే BMW M 1000 RR 0-11 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.1 సెకెన్లలో అందుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 3.6 కిలోమీటర్లని కంపెనీ తెలిపింది. ఇది రెయున్, రోడ్, డైనమిక్, రేస్ లాంటి నాలుగు రైడింగ్ మోడ్లలో లభిస్తుందని కంపెనీ వెల్లడించింది.