Friday, November 22, 2024

ట్విటర్‌లో బ్లూటిక్‌ ఇక పెయిడ్‌ సర్వీస్‌.. ఉద్యోగుల తొలగింపునకు మస్క్‌ ప్లాన్‌

ట్విటర్‌లో పలు మార్పులకు కొత్త యజమాని ఎలాన్‌ మస్క్‌ శ్రీకారం చుట్టారు. ట్విటర్‌లో పెయిడ్‌ వెర్షన్‌ను తీసుకు రానున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు నెలవారీ బ్లూ టిక్‌ సహా అదనపు ఫీచర్ల సబ్‌స్క్రిప్షన్‌ ధరను 19.99 డాలర్లకు పెంచాలని ఆయన సంబంధించ అధికారులను ఆదేశించినట్లు ప్రముఖ వెబ్‌సైట్‌ ది వెర్జ్‌ పేర్కొంది. ప్రస్తుతం 4.99 డాలర్లు చెల్లిస్తే ట్విటర్‌ బ్లూ పేరిట బ్లూ టిక్‌ సహా అదనపు ఫీచర్లును అందిస్తున్నారు. ప్రకటనలు లేని ఆర్టికల్స్‌, ప్రత్యేక రంగుతో ఉండే హోం స్క్రీన్‌ ఐకాన్‌ ఈ ప్యాక్‌లో భాగంగా ఉంటాయి. ఇకపై ఈ సేవలకు 19.99 డాలర్లు వసూలు చేయాలని మస్క్‌ నిర్ణయించినట్లు ఈ కథనంలో పేర్కొంది.

దీంట్లో పెయిడ్‌ వెరిఫికేషన్‌ను కూడా జతచేసి బ్లూ టిక్‌ బ్యాడ్జ్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కేవలం బ్లూటిక్‌ మాత్రమే కావాలనుకునేవారికి ఎలాంటి రుసుం వసూల చేయడంలేదు. ఇప్పుడు బ్లూ టిక్‌ను కూడా పెయిడ్‌ వెర్షన్‌లో భాగం చేయనుండడంతో బ్లూ టిక్‌ కోసం ఇక నుంచి ప్రత్యేకంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కంపెనీ అనుసరిస్తున్న వెరిఫికేషన్‌ ప్రక్రియను పున:సమీక్షిస్తున్నట్లు ఆదివారం నాడు మస్క్‌ ట్విట్‌ చేయడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరింది. కంపెనీ ఆదాయంలో సగం సబ్‌స్క్రిప్షన్ల ద్వారానే సమకూర్చుకోవాలని మస్క్‌ భావిస్తున్నారు.

నవంబర్‌ 7కల్లా దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని ఉద్యోగులను మస్క్‌ ఆదేశించారు. విభాగాల వారికిగా తొలగించాల్సిన ఉద్యోగుల జాబితాను కూడా సిద్ధం చేయాలని ఎలాన్‌ మస్క్ ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. దశల వారిగా కనీసం 50 శాతం ఉద్యోగులు తొలగించాలని ఆయన భావిస్తున్నట్లు వార్త కథనాలు వెలువడ్డాయి.

- Advertisement -

25 శాతం ఉద్యోగుల తొలగింపుకు ప్లాన్‌
ట్విటర్‌లో మొదటి దశలో 25 శాతం మంది ఉద్యోగులను తొలగించాలని టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ నిర్ణయించారు. ఆయన ఇటీవలనే ట్విటర్‌ను కొనుగోలు చేశారు. ఆ వెంటనే సంస్థ సీఈఓత పాటు పలువురు ఉన్నత స్థానాల్లో ఉన్న ఉద్యోగులను ఆయన తొలగించారు. 75 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తారన్న వార్తలను ఖండించిన ఎలాన్‌ మస్క్ తాజాగా ఉద్యోగుల సంఖ్యను భారీగా కుదించాలని మస్క్‌ నిర్ణయించినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక సోమవారంనాడు ఒక కథనాన్ని ప్రచురించింది. స్టాక్‌ గేయిన్స్‌ను తప్పించుకునేందుకు నవంబర్‌ 1 లోపుగానే కొంత మంది ఉద్యోగులను తొలగించనున్నారని ఆ కథనంలో పేర్కొంది. నవంబర్‌ 1 లోపుగానే ఉద్యోగులను తొలగిస్తారన్న వార్తను ఎలాన్‌ మస్క్‌ ఖండించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement